ఆ పాట విషయంలో బోయపాటి అన్‌హ్యాపీ!

ఆ పాట విషయంలో బోయపాటి అన్‌హ్యాపీ!

బోయపాటి శ్రీను కూడా మిగతా దర్శకుల మాదిరిగానే దేవిశ్రీప్రసాద్‌ని దూరం పెట్టాడు. బాలకృష్ణతో తీస్తోన్న చిత్రానికి తమన్‌తో సంగీతం చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. సరైనోడుకి మించిన బ్లాక్‌బస్టర్‌ ఆడియో ఇవ్వమంటూ తమన్‌ని 'పిండుతోన్న' బోయపాటి ఇటీవల తమన్‌ చేసిన ఒక పాట విషయంలో చాలా అన్‌హ్యాపీగా వున్నాడట.

'వెంకీ మామ' కోసం తమన్‌ 'కోకోకోలా పెప్సీ' అనే పాట చేసాడు. బాలకృష్ణ గురించి అభిమానులు ముద్దుగా 'కోకోకోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ' అంటూ వుంటారు. చాలా పాపులర్‌ అయిన స్లోగన్‌నే 'వెంకీ మామ'లో వాడేసారు. ఆ స్లోగన్‌ని బాలకృష్ణ చిత్రం కోసం దాచి వుంచాల్సిందని, ఆ పాట బాలయ్యపై పెడితే బ్రహ్మాండమైన హిట్‌ అయి వుండేదని బోయపాటి ఫీలవుతున్నాడట.

అయితే ఇప్పట్లో బాలయ్యతో పని చేసే అవకాశం వస్తుందని ఊహించని తమన్‌ ఆ పాటని వెంకీమామకి వాడేసినట్టున్నాడు. బోయపాటితో బాలయ్య చేసే చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడనగానే బాలకృష్ణ అభిమానులకి ఈ పాటే తలపుకొస్తోంది. ఆల్రెడీ ఈ క్యాచ్‌ ఫ్రేజ్‌ వాడేసారు కనుక తమన్‌ మరేదైనా కొత్త వాక్యానికి ట్యూన్‌ కట్టి ఫాన్స్‌ని ఖుషీ చేస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English