యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్న తమన్

యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్న తమన్

తమన్.. తమన్.. ఇప్పుడు తెలుగు సినిమా సంగీత ప్రియుల్లో ఎక్కడ చూసినా ఈ పేరే చర్చనీయాంశం అవుతోంది. ఇంతకుముందు ఊకదంపుడు సంగీతంతో విసిగించిన తమన్.. గత రెండేళ్లలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ‘మహానుభావుడు’, ‘తొలి ప్రేమ’, ‘అరవింద సమేత’ లాంటి చిత్రాలు సంగీత ప్రియులకు కొత్త తమన్‌ను పరిచయం చేశాయి. ఈ సినిమాల పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు, స్కోర్‌తో తమన్ హాట్ టాపిక్ అయ్యాడు. అతడి నుంచి వస్తున్న వేరే సినిమాలు సైతం సంగీత పరంగా ఆకట్టుకునేలాగే ఉన్నాయి. తక్కువ వ్యవధిలో తమన్ సంగీతం అందించిన నాలుగు క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో వాటికి సంబంధించిన ప్రోమోలు, పాటలు యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి.

‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన యూబ్యూట్‌లో ఏం రిలీజ్ చేసినా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సామజవరగమన, రాములో రాములా పాటలు కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్‌తో యూబ్యూబ్‌లో కొత్త రికార్డులు నమోదు చేశాయి. నిన్న రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ సైతం భారీగా వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

దీంతో పాటుగా తమన్ సంగీతంతో వచ్చిన ‘డిస్కో రాజా’ టీజర్, ‘వెంకీ మామ’ ట్రైలర్లు సైతం టాప్-5 ట్రెండింగ్ వీడియోల్లో ఉండటం విశేషం. మరోవైపు సాయిధరమ్ తేజ్ సినిమా ‘ప్రతి రోజూ పండగే’ పాటలు, ట్రైలర్ సైతం యూట్యూబ్‌లో మంచి స్పందన రాబట్టుకుంటున్నాయి. ఇలా తెలుగు వాళ్లు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు తమన్ సందడే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం అవి తమన్ పేరును మార్మోగించేస్తున్నాయి. తమన్‌కిది ఒక డ్రీమ్ టైం అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English