సూపర్ స్టార్ షాకివ్వబోతున్నాడా?

సూపర్ స్టార్ షాకివ్వబోతున్నాడా?

కొన్నేళ్ల కిందటి వరకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతోందంటే ఉండే హంగామానే వేరుగా ఉండేది. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా విపరీతమైన హైప్ వచ్చేది. కానీ ఎలాంటి హీరో అయినా పరిమితికి మించి ఫ్లాపులు ఇస్తే క్రేజ్ పడిపోతుందనడానికి రజనీకాంత్ కూడా మినహాయింపుగా నిలవలేకపోయాడు.

‘రోబో’ తర్వాత రజనీకి హిట్టే లేకపోవడం, మధ్య మధ్యలో మరీ మామూలు సినిమాలు రావడంతో రజనీకి క్రేజ్ తగ్గింది. మార్కెట్ పడిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి ‘పేట’ అనే సినిమా విడుదలైన ఫీలింగ్ కూడా మన ప్రేక్షకులకు కలగలేదు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. ఈ ప్రభావం రజనీ కొత్త సినిమా ‘దర్బార్’ మీద కూడా పడింది. దీనికి కూడా అంత క్రేజ్ ఏమీ కనిపించడం లేదు.

ఒక మూడేళ్ల కిందట మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్.. రజనీతో సినిమా తీశాడంటే హైప్ ఏ రేంజిలో ఉండేదో అంచనా వేయొచ్చు. కానీ ఈ మధ్య మురుగదాస్ ట్రాక్ రికార్డు కూడా దెబ్బ తినేయడం, రజనీ క్రేజ్ పడిపోవడంతో ‘దర్బార్’ తమిళంలో కూడా అనుకున్న స్థాయిలో హైప్ తెచ్చుకోలేకపోయింది. తెలుగులో పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఐతే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘దర్బార్’తో రజనీ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

మురుగదాస్ చాలా కసితో ఈ సినిమా తీశాడట. ఈ మధ్యే రిలీజైన ‘దర్బార్’ ఆడియో వింటే.. పూర్తిగా మాస్ బీట్లు, హీరోయిజం ఎలివేట్ చేసే పాటలే ఉన్నాయి. రజనీ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది ఆడియో. ‘పేట’లో మాదిరి క్లాస్ పాటల జోలికే వెళ్లలేదు అనిరుధ్. సినిమాలో హీరోయిజం ఒక రేంజిలో ఉంటుందనే సంకేతాలు ఇచ్చాయి పాటలు.  మురుగదాస్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా రజనీతో సినిమా కోసం ఎన్నో ఏళ్లు కల కన్నాడు. కాబట్టి వీళ్లిద్దరి రేంజికి తగ్గ సినిమా వచ్చిందంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం. తెలుగులో తక్కువ అంచనాలుండటం సినిమాకు కలిసొచ్చి సంక్రాంతికి రజనీ షాక్ ఇస్తే ఆశ్చర్యం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English