మ‌హేష్‌ను మార‌నివ్వ‌రా?

మ‌హేష్‌ను మార‌నివ్వ‌రా?

లుక్స్ పరంగానే కాదు..  క్యారెక్టర్ల పరంగా కూడా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు చాలా బోర్ కొట్టించేశాడు. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్ని పరిశీలిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలందరిలో మహేష్ బాబంత మొనాటనస్ లుక్స్ ఇంకెవరికీ కనిపించవు. 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్', 'భరత్ అనే నేను', 'మహర్షి'.. ఇలా ఏ సినిమా చూసుకున్నా మహేష్ ఒకేలా కనిపిస్తాడు. ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు కూడా ఒకేలా అనిపిస్తాయి. అతి మంచి వాడిగా.. కుటుంబాన్ని, సమాజాన్ని ఉద్ధరించేవాడిగా మహేష్ కనిపించడం మామూలైపోయింది. ప్రతి సినిమాలోనూ హీరో గొప్పదనాన్ని, అతడి ఆశయాల్ని పొగుడుతూ పాటలు పెట్టడం కూడా ఆనవాయితీ అయిపోయింది. వాటిలో మహేష్ లుక్స్.. నడక.. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఒకేలా తయారవడంతో జనాలకు మొహం మొత్తేసింది.

వరుసగా ఇళా మహేష్‌ను చూసి చూసి.. 'మహర్షి' సినిమాకు వచ్చేసరికి అభిమానులు సైతం ఫ్రస్టేట్ అయిపోయారు. ఇలా జనాల్ని ఉద్ధరించే.. మంచిని పంచే సినిమాలు మానేయమని.. హీరోను విపరీతంగా పొగిడే పాటలకు దూరంగా ఉండమని సోషల్ మీడియాలో మహేష్‌ను వేడుకునే స్థాయికి వచ్చారు. ఇలాంటి తరుణంలోనే మహేష్ అతి మంచి సినిమాల్ని పక్కన పెట్టి ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జట్టు కట్టడంతో మంచి మసాలా సినిమా చూడబోతున్నామన్న భావన అభిమానులకు కలిగింది. ఇప్పటిదాకా ఈ సినిమా అప్పీయరెన్స్ కూడా ఆ తరహాలోనే కనిపించింది.

కానీ ఇంతలో 'సూర్యుడివో చంద్రుడివో' అంటూ సినిమా నుంచి ఒక పాట వదిలారు. అది చూస్తే మహేష్ మళ్లీ పాత స్టయిల్లోకి పడిపోయాడనిపిస్తోంది. అందులో ఎప్పట్లాగే మహేష్ రొటీన్ లుక్స్, నడక, స్క్రీన్ ప్రెజెన్స్‌తో బోర్ కొట్టించాడు. లిరిక్స్ కూడా అంతే బోరింగ్‌గా ఉన్నాయి. సాహిత్యం బాలేదని కాదు కానీ.. మహేష్‌ను ఇలా సూర్యుడివో చంద్రుడివో అని పొగడ్డం ఎన్ని పాటల్లో చూడలేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అయినా మహేష్ మారతాడనుకుంటే.. ఇందులో కూడా ఇదేనా అంటూ అభిమానులు అసహనానికి గురవుతున్నారు. మహేష్ మారదామన్నా అతడి దర్శకులు మారనిచ్చేట్లు చూస్తుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English