పరశురామ్‌పై పగ తీర్చుకున్న మైత్రి!

పరశురామ్‌పై పగ తీర్చుకున్న మైత్రి!

గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌కి చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. గీత గోవిందం తర్వాతి చిత్రాన్ని  గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నానంటూ తాను అడ్వాన్స్‌ తీసుకున్న నిర్మాతలందరినీ వెయిటింగ్‌లో పెట్టాడు. అలా వెయిటింగ్‌లో వున్నవారిలో మైత్రి మూవీ మేకర్స్‌ కూడా వున్నారు. తీరా గీతా ఆర్ట్స్‌లో తదుపరి చిత్రం చేయకుండా 14 రీల్స్‌ వారితో పరశురామ్‌ ఒప్పందం చేసుకున్నాడు.

దీంతో మైత్రి మూవీ మేకర్స్‌ వారికి కోపం వచ్చి తాము ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. తమ అడ్వాన్స్‌ రాబట్టుకోవడమే కాకుండా ఆ సంగతిని మీడియాకి కూడా లీక్‌ చేసారు. దాంతో పరశురామ్‌కి అడ్వాన్స్‌లిచ్చిన చాలా మంది నిర్మాతలు తమ డబ్బులు తమకి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

 ఇప్పుడు 14 రీల్స్‌ నుంచి తనకి వచ్చే పారితోషికాన్ని ఇలా అడ్వాన్స్‌లు మాఫీ చేయడంతోనే సరిపెడుతున్నాడు. ఇంతా చేసి ఈ చిత్రం చేస్తానని ఒప్పుకున్న నాగచైతన్య ఇంకా డేట్స్‌ ఇవ్వలేదు. అతను డేట్స్‌ ఇచ్చే దానిని బట్టి ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళుతుంది. పరశురాం ఏమో ఈలోగా ఇలా ఇరుక్కుపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English