మహేష్‌, బన్నీతో ఎందుకు పెట్టుకుంటా?

మహేష్‌, బన్నీతో ఎందుకు పెట్టుకుంటా?

'వెంకీమామ' సంక్రాంతికి రానుందనే వార్త అప్పట్లో కలకలం సృష్టించింది. అంతవరకు రిలీజ్‌ డేట్‌ ప్రకటించకుండా వుండిపోయిన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' నిర్మాతలు ఒకేసారి ఒకే తేదీని ప్రకటించేసారు. రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ ప్రకటిస్తే ఇక సురేష్‌బాబు వేరే తేదీ చూసుకుంటారనేది వారి ఉద్దేశం.

అయితే వెంకీమామని నెల రోజులు ముందుగానే వెంకటేష్‌ బర్త్‌డేకి రిలీజ్‌ చేస్తున్నారు. తనకి అసలు సంక్రాంతి రిలీజ్‌ ఆలోచన లేనే లేదని, దసరాకి విడుదల చేద్దామనుకుంటే వెంకటేష్‌కి కాలు బెణకడం వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడిందని, ఆ తర్వాత రాశి ఖన్నా డేట్స్‌ లేక దీపావళి రిలీజ్‌ మిస్‌ అయ్యామని, అప్పట్నుంచి డిసెంబర్‌ 13 లేదా క్రిస్మస్‌ రిలీజ్‌ అనుకుంటున్నామని సురేష్‌ చెప్పారు.

సంక్రాంతికి మహేష్‌, అల్లు అర్జున్‌ సినిమాలుంటే తన సినిమా ఎందుకు విడుదల చేస్తానన్నారు. అయితే డిసెంబర్‌ 13న వచ్చినా కానీ రెండు వారాల పాటు థియేటర్లు హోల్డ్‌ చేసి పండగని క్యాష్‌ చేసుకుంటానని, లాంగ్‌ రన్‌ వచ్చినట్టయితే సంక్రాంతికి కూడా వందకి పైగా థియేటర్లు హోల్డ్‌ చేస్తానని సురేష్‌ తెలియజేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English