పవన్‌ కళ్యాణ్‌ని రీప్లేస్‌ చేసేదెవరు?

పవన్‌ కళ్యాణ్‌ని రీప్లేస్‌ చేసేదెవరు?

'పింక్‌' రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నప్పుడు దిల్‌ రాజు దృష్టిలో బాలకృష్ణ వున్నాడు. ఆయనయితే ఆ పాత్రకి న్యాయం చేయగలడని దిల్‌ రాజు భావించాడు. ఇంతలో పవన్‌ కళ్యాణ్‌కి ఆ చిత్రం పట్ల ఆసక్తి వుందని తెలుసుకుని పవర్‌స్టార్‌తో సినిమా తీసే కలని ఈ చిత్రంతో సాకారం చేసుకోవాలని చూసాడు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ అయిపోవడంతో పింక్‌ రీమేక్‌ కథ మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలి అనే దానిపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీస్‌లో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ఆడవాళ్లపై జరుగుతోన్న దాడులు, ఇటీవల వెటర్నరీ డాక్టర్‌ 'దిశ'పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ టైమ్‌లో తీయడం వల్ల జనం ఎక్కువగా ఆకర్షితులవుతారని దిల్‌ రాజు భావిస్తున్నాడు. మెయిన్‌ ఫిమేల్‌ లీడ్‌గా సమంత నటిస్తే బాగుంటుందని కూడా అతను సూచిస్తున్నాడు. మరి పవన్‌ కళ్యాణ్‌ ఇప్పట్లో అందుబాటులో వుండడు కనుక ఆ లాయర్‌ పాత్ర ఎవరితో చేయిస్తారు?

ముందుగా అనుకున్నట్టు బాలకృష్ణనే సంప్రదిస్తారా లేక మరెవరైనా స్టార్‌ హీరోని తీసుకొస్తారా? తెలుగు రీమేక్‌కి కావాల్సిన సరంజామా అంతా 'ఎంసిఏ' దర్శకుడు శ్రీరామ్‌ వేణు సిద్ధం చేసేసాడట. ఇక దిల్‌ రాజు స్టార్‌ కాస్ట్‌ని ఫైనలైజ్‌ చేసేస్తే దీనిని నాలుగు నెలలలో తీసేసి జూన్‌లోగా విడుదల చేసేసుకోవచ్చునట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English