మహేష్‌కి ఇది సరిపోదు ప్రసాదూ!

మహేష్‌కి ఇది సరిపోదు ప్రసాదూ!

'సూర్యుడివో చంద్రుడివో' అంటూ సరిలేరు నీకెవ్వరులో మూడవ పాటని కూడా వదిలేసారు. హీరో గురించిన గొప్ప లక్షణాలని, అతని వల్ల ఒక కుటుంబానికి జరిగే మంచిని వివరిస్తూ సాగే ఈ మెలోడీ వినడానికి బాగానే అనిపిస్తోంది కానీ చార్ట్‌బస్టర్‌ లక్షణాలయితే లేవు.

సరిలేరు నీకెవ్వరు టైటిల్‌ సాంగ్‌ని చాలా కాలం క్రితమే విడుదల చేసారు. ఆ తర్వాత ఇటీవలే మంచి హంగామాతో 'మైండ్‌ బ్లాక్‌' పాట వదిలారు. అది మాస్‌ని ఒక మోస్తరుగా ఆకట్టుకుంది. ఈ మూడవ పాట కూడా సోసోగా వుంది కానీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ లేదా క్రేజ్‌ తీసుకొచ్చేలా అయితే లేదనే చెప్పాలి.

ఒకవైపు ఈ చిత్రానికి పోటీగా విడుదలవుతోన్న 'అల వైకుంఠపురములో' పాటలు అంత పెద్ద హిట్‌ అయితే, సరిలేరు నీకెవ్వరు పాటలు మాత్రం మహేష్‌ గత చిత్రం 'మహర్షి' పాటలని కూడా మరపించేలా లేకపోవడం అభిమానులని నిరాశ పరుస్తోంది. వరుసగా మహేష్‌తో పని చేస్తోన్న దేవి ఇంతకుముందు చేసిన చిత్రాల్లో ఒక సూపర్‌ చార్ట్‌బస్టర్‌ని ఇవ్వగలిగాడు. కానీ ఈ చిత్రానికి మాత్రం ఇంతవరకు అలాంటి పాట ఏదీ రాలేదు. తదుపరి విడుదల చేసే పాట అయినా ఫాన్స్‌ ఉర్రూతలూగేలా, సినిమాపై అంచనాలు మరింత పెంచేలా వుంటుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English