ఆ అవమానమే రజనీలో కసి పెంచిందట

ఆ అవమానమే రజనీలో కసి పెంచిందట

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు రజనీకాంత్. ఆయనకున్న ఫాలోయింగ్, రేంజ్, మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం అంటే మాటలు కాదు. ఐతే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రజనీకి సినిమాల్లో సాదర స్వాగతం ఏమీ లభించలేదు. మొదట్లో కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు.

బాలచందర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ అండతో అరంగేట్రం బాగానే జరిగినప్పటికీ.. ఆ తర్వాత రజనీకి అవమానాలు తప్పలేదట. ఒక నిర్మాత తనను ఘోరంగా అవమానించాడని.. ఆ అవమానమే తనలో కసిని పెంచి స్టార్ హీరోగా ఎదిగేలా చేసిందని తన కొత్త చిత్రం 'దర్బార్' ఆడియో వేడుకలో రజనీ వెల్లడించాడు. ఆ అనుభవం గురించి రజనీ మాటల్లోనే..

"బాలచందర్‌తో చేసిన '16 వయదినిలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) సినిమా తర్వాత నన్ను హీరోగా పెట్టి ఒక నిర్మాత సినిమా తీస్తానన్నారు. కానీ సెట్స్‌కు వెళ్లే వరకు అడ్వాన్స్ ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పాను. అప్పుడాయన 'ఏరా నీకంత పొగరా? నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో' అని చెడమడా తిట్టారు. నాకు చాలా బాధేసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాలో కసి పెరిగింది. పెద్ద స్థాయికి చేరుకోవాలనుకున్నాను. ఆ తర్వాత రెండున్నరేళ్లకే ఫారిన్ కారు కొనే స్థాయికి ఎదిగాను'' అని రజనీ చెప్పాడు.

ఇక 'దర్బార్' గురించి చెబుతూ.. ఈ కథను తాను పుష్కరం కిందట 'శివాజీ' చేస్తున్నపుడే మురుగదాస్ తనకు చెప్పాడని రజనీ వెల్లడించాడు. ఈ కథను తాను అనుకున్నదానికంటే చాలా బాగా మురుగదాస్ తెరకెక్కించాడని.. ఈ సినిమా అభిమానులకు పండుగలా ఉంటుందని రజనీ చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English