సింహాల్ని వదిలేయ్ బాలయ్యా

సింహాల్ని వదిలేయ్ బాలయ్యా

సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు.. లక్ష్మీ నరసింహా.. సింహా.. లయన్.. జై సింహా.. ఇవీ నందమూరి బాలకృష్ణ ‘సింహం’ సెంటిమెంటుతో తన సినిమాలకు పెట్టుకున్న టైటిళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో తాను సింహం లాంటి వాడినని బాలయ్య ఫీలవుతాడో ఏమో తెలియదు కానీ.. టైటిళ్ల విషయంలో ఆయన ‘సింహం’ పిచ్చి మామూలుది కాదు.

కేవలం టైటిళ్లలో సింహాన్ని పెట్టడమే  కాదు.. ఆయన డైలాగులు, పాటల్లో కూడా ఈ పదాన్ని విపరీతంగా వాడేస్తుంటారు. ఇక టైటిళ్లు పడేటపుడు.. హీరో ఎంట్రీ ఇచ్చేటపుడు.. సింహం సౌండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య కొత్త సినిమా ‘రూలర్’ టైటిల్ ప్రెజెంటేషన్లోనూ అదే వరస. సింహం బొమ్మను చూపించి.. గర్జనను వినిపించి టైటిల్ వేశారు.

ఇక బాలయ్య సినిమా అంటే పడుకున్న ‘సింహం’ మీద డైలాగ్ లేకుండా ఉండదు కదా? పడుకున్న సింహం.. లేచిన సింహం.. దెబ్బ తిన్న సింహం అంటూ ఏదో ఒక డైలాగ్ వేయాల్సిందే. ‘రూలర్’ కూడా అందుకు మినహాంపు కాదు. ‘‘పార్శిల్ చేయడానికి ఇది దెబ్బ తిన్న సింహంరా.. అంత సులువుగా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది’’ అంటూ ముతక డైలాగ్ ఒకటి పెట్టారు. అసలే ఈ సినిమా ట్రైలర్ పాత స్టయిల్లో ఉండి.. సామాన్య ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది.

దీనికి తోడు ఈ సింహం సౌండ్లు.. డైలాగులు మరీ మొనాటనస్‌గా ఉండి ప్రేక్షకుల ఆసక్తిని మరింత సన్నగిల్లేలా చేశాయి. బాలయ్యకు ఈ ‘సింహం’ పిచ్చి ఎప్పుడు వదులుతుందో.. ఆయన వేరే టైటిళ్లు పెట్టుకోవడం కన్నా సింహం-1, సింహం-2 అని పెట్టుకుని సిరీస్‌లు తీసుకుంటే బెటర్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English