వ‌ర్మా.. మ‌రీ ఇంత దిగ‌జారాలా?

వ‌ర్మా.. మ‌రీ ఇంత దిగ‌జారాలా?

నిండా మునిగాక చ‌లేంటి అని ఒక సామెత ఉంటుంది. రామ్ గోపాల్ వ‌ర్మ ఇలాగే అలోచిస్తున్న‌ట్లున్నాడు. ఒక‌ప్పుడు ఆయ‌న ఎలాంటి సినిమాలు తీశాడో.. దేశ‌వ్యాప్తంగా ఎలా సంచ‌ల‌నం రేపాడో.. ఎంత‌మందికి స్ఫూర్తిగా నిలిచాడు.. భార‌తీయ సినిమాను ఎంత‌గా ప్ర‌భావితం చేశాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో వ‌ర్మ ఎంత‌గా ప‌త‌నం అయ్యాడో కూడా తెలిసిందే.

ఇంత‌కంటే ప‌త‌నం కావ‌డానికి ఏముందిలే అనుకున్న ప్ర‌తిసారీ.. వ‌ర్మ పాతాళం కింది లోతుల్ని కొలిచే ప్ర‌య‌త్నంలో ప‌డుతూనే ఉన్నాడు. ఆయ‌న ఈ మ‌ధ్య ఎంత నాసిర‌కం సినిమాలు తీస్తున్నాడో తెలియంది కాదు. తాజాగా అత్యంత వివాదాస్ప‌ద క‌థాంశాన్ని ఎంచుకుని క‌మ్మ‌ రాజ్యంలో క‌డప రెడ్లు అనే సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్రోమోలు చూస్తే మ‌రీ అథ‌మ‌స్థాయిలో క‌నిపించాయి. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుకు అనుకూలంగా.. ప్ర‌తిప‌క్ష పార్టీల ముఖ్య నేత‌ల్ని కించ‌ప‌రిచేలా ఈ సినిమా తీశాడ‌న్న‌ది స్ప‌ష్టం. అది చాల‌ద‌న్న‌ట్లు సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయిన నేప‌థ్యంలో వ‌ర్మ ప‌బ్లిసిటీ కోసం వ‌దులుతున్న పోస్ట‌ర్లు చూసి జ‌నాలు కంగుతింటున్నారు.

మ‌రీ నాసిర‌కం మార్ఫింగుల‌తో వ‌ర్మ త‌న స్థాయిని ఎంతగా త‌గ్గించుకోవాలో అంత‌గా త‌గ్గించుకుంటున్నాడు. చంద్ర‌బాబు అండ్ కో ఆందోళ‌న‌గా వ‌ర్మ సినిమాను చూస్తున్న‌ట్లు.. జ‌గ‌న్, విజ‌య సాయిరెడ్డి ఈ సినిమా చూస్తూ చాలా ఆనంద ప‌డిపోతున్న‌ట్లు.. ఇలా సిల్లీ ఎడిట్ల‌తో వ‌ర్మ త‌న సినిమాను ట్విట్ట‌ర్లో ప్ర‌మోట్ చేసుకుంటున్న తీరు నెటిజ‌న్ల‌కు అస‌హ‌నం తెప్పిస్తోంది. మ‌రీ ఇంత దిగ‌జారిపోవాలా అంటూ ఒక‌ప్ప‌టి వ‌ర్మ డైహార్డ్ ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారు.

    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English