'వినయ విధేయ..' బోయపాటికి నో రిగ్రెట్స్‌!

'వినయ విధేయ..' బోయపాటికి నో రిగ్రెట్స్‌!

'వినయ విధేయ రామ' లాంటి చిత్రం చేసినందుకు అభిమానులకి రామ్‌ చరణ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాడు. 'రంగస్థలం'తో నటుడిగా స్థాయి పెంచుకున్న తర్వాత అలాంటి ఒక మాస్‌ మసాలా చిత్రాన్ని చేయడం, అందులో జనం నవ్వుకునే సన్నివేశాలుండడంతో చరణ్‌ ఇకపై అలాంటి చిత్రాలు చేయనని మాటిచ్చాడు. ఆ సినిమా నిర్మాణంలో వుండగానే ఫలితం ఏమిటనేది చరణ్‌ గెస్‌ చేసాడు. అయితే పలు సన్నివేశాలపై చరణ్‌తో పాటు చిరంజీవి అభ్యంతరం చెప్పినా కానీ బోయపాటి శ్రీను అసలు మాట వినలేదు. మాస్‌కి అలాంటి సన్నివేశాలే నచ్చుతాయని వాదించాడు. సీనియర్‌ దర్శకుడు కనుక అతడితో పూర్తిగా విబేధించలేకపోయారు. కానీ ఫలితం మాత్రం వారు ఊహించినట్టే వచ్చింది.

కానీ ఈ చిత్రం విషయంలో బోయపాటి శ్రీనుకి మాత్రం ఎలాంటి రిగ్రెట్స్‌ లేవు. ఆ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో అరవై కోట్ల షేర్‌ వచ్చిందని, బడ్జెట్‌ ఎక్కువ అవడం వల్ల ఫెయిలయిందే తప్ప సినిమా జనానికి నచ్చకపోవడం కాదని వాదిస్తుంటాడు. తనకి ఇలాంటి సినిమాలు తీయడమే వచ్చని, ఇకపై తీసే సినిమాలు కూడా అలాగే వుంటాయని సన్నిహితులతో చెబుతుంటాడు. బాలకృష్ణతో తీస్తోన్న చిత్రం కూడా బోయపాటి మార్క్‌తోనే వుంటుందట. మరి అది 'సింహా' మాదిరిగా జనాన్ని మెప్పిస్తుందా లేక 'వినయ విధేయ రామ'లా నవ్వుల పాలవుతుందా అనేది బోయపాటి శ్రీను ఎంత కంట్రోల్‌లో వుంటాడు, ఎంత జాగ్రత్తగా తన మాస్‌ సీన్స్‌ని హ్యాండిల్‌ చేస్తాడనే దానిపై డిపెండ్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English