పూజకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన ప్రభాస్‌

పూజకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన ప్రభాస్‌

పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్‌ టేకప్‌ చేస్తోంది. ప్రభాస్‌తో 'జాన్‌' చిత్రంలో నటిస్తోన్న పూజకి ప్రభాస్‌ కానీ, యువి క్రియేషన్స్‌ కానీ అడ్డు చెప్పడం లేదు. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది అంత ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. హౌస్‌ఫుల్‌ 4లో నటించడం కోసం పూజ హెగ్డే 'జాన్‌'కి ఇచ్చిన డేట్స్‌ వాడుకున్నా కానీ ఆమెకి అక్కడి మార్కెట్‌లో ఎక్స్‌పోజర్‌ లభిస్తే అది తమ సినిమా మార్కెట్‌కి హెల్ప్‌ అవుతుందని అప్పట్లో అడ్డు చెప్పలేదు. ఇప్పుడు కూడా పూజ రెండు భారీ హిందీ చిత్రాల్లో నటించేందుకు సందిగ్ధంలో పడితే 'జాన్‌' మేకర్స్‌ ఆమెకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌ని 'సాహో' కోసం తీసుకొస్తే ఆమె ఏడు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసింది. అదే పూజ హెగ్డే అయితే రెగ్యులర్‌గా తెలుగు సినిమాలకి ఛార్జ్‌ చేసినట్టే చేస్తోంది. హౌస్‌ఫుల్‌ లాంటి చిత్రాల వల్ల పూజ హెగ్డేకి హిందీలో మాస్‌ మార్కెట్‌ లభిస్తుంది. అందుకే హిందీలో నటించే విషయంలో ఆమెని జాన్‌ నిర్మాతలే స్వయంగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఎలాగో ప్రభాస్‌కి ఎక్కువ రోల్‌ వుండి, పూజకి లిమిటెడ్‌ స్క్రీన్‌ టైమ్‌ వుంటుంది కనుక ఆమె అందుబాటులో వున్నపుడే తన సీన్స్‌ తీయాలని డిసైడ్‌ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English