ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌లేను.. అందుకే ఒప్పుకోలేదు

ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌లేను.. అందుకే ఒప్పుకోలేదు

సాటి హీరోయిన్ బాగా చేసింద‌ని పొగ‌డ్డానికే చాలామంది హీరోయిన్ల‌కు మ‌న‌సొప్ప‌దు. అలాంటిది ఆ హీరోయిన్ లాగా నేను చేయ‌లేను అని చెప్పి ఒక‌ పాత్ర‌కు నో చెప్ప‌డ‌మే కాదు.. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా ఒప్పుకోవ‌డానికి చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. త‌న‌క‌లాంటి విశాల హృద‌య‌మే ఉంద‌ని ర‌ష్మిక మంద‌న్నా చాటిచెప్పింది.

ఈ క‌న్న‌డ భామ‌ను తెలుగు సూప‌ర్ హిట్ మూవీ జెర్సీ హిందీ రీమేక్ కోసం క‌థానాయిక‌గా అనుకుంటున్న‌ట్లు ఇంత‌కుముందు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో కానీ.. ఆమెను కాద‌ని మృనాల్ ఠాకూర్‌ను ఈ సినిమాకు క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. దీంతో ర‌ష్మిక‌ను అస‌లు నిజంగానే సంప్ర‌దించారా లేదా అన్న సందేహాలు క‌లిగాయి.

ఐతే త‌న‌ను జెర్సీ హిందీ రీమేక్ కోసం అడిగిన మాట వాస్త‌వ‌మే అని ర‌ష్మిక తాజాగా మీడియాకు వెల్ల‌డించింది. ఐతే తెలుగులో శ్ర‌ద్ధ శ్రీనాథ్ త‌న పాత్ర‌ను అద్భుతంగా పోషించింద‌ని.. ఆ పాత్ర‌కు తాను న్యాయం చేయ‌లేనేమో అనిపించి ఆ సినిమా ఒప్పుకోలేద‌ని ర‌ష్మిక తెలిపింది.

డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌తో ప్ర‌శంస‌లందుకున్నాక కూడా ర‌ష్మిక తాను ఈ పాత్ర చేయ‌లేన‌ని చెప్పి నో చెప్ప‌డం అంటే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. త‌న స‌మ‌కాలీనురాలైన శ్ర‌ద్ధ గురించి ఇంత పాజిటివ్‌గా చెప్ప‌డం విశేష‌మే. ఈ సంగ‌త‌లా ఉంచితే నాని పాత్ర‌లో షాహిద్ న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ రాహుల్ తిన్న‌నూరినే డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండ‌టం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English