దేవిశ్రీప్రసాద్‌కి 'మైండ్‌ బ్లాక్‌' అయ్యే ర్యాగింగ్‌!

దేవిశ్రీప్రసాద్‌కి 'మైండ్‌ బ్లాక్‌' అయ్యే ర్యాగింగ్‌!

'శైలజ.. శైలజ..' పాటనే అటు తిప్పి, ఇటు తిప్పి, 'సోను తుజా మాజ్యవర్‌ భరోసా' ర్యాప్‌ స్టయిల్‌ వైరల్‌ పాటకి జోడించి చేసిన 'మైండ్‌బ్లాక్‌' సాంగ్‌ పదకొండు మిలియన్‌ వ్యూస్‌ అయితే సాధించింది కానీ ఖచ్చితంగా సినిమాకి క్రేజ్‌ తీసుకురాలేకపోయింది. పైగా ఈ పాట వల్ల దేవిశ్రీప్రసాద్‌ ఇంటర్నెట్‌లో ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. ఈ పాటపై జరుగుతోన్న ట్రోలింగ్‌ ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే వుంది.

సోషల్‌ మీడియాని బాగా ఫాలో అయ్యే దేవికి ఈ ట్రోలింగ్‌ సంగతి తెలియదని కాదు. దీని వల్ల అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అంతకుముందే చేసిన మూడు పాటల్లో పస లేదని 'అల వైకుంఠపురములో' పాటల ముందు తేలిపోకుండా వుండాలని 'మైండ్‌బ్లాక్‌' పాటని ముందుగా విడుదల చేసారు. ఈ పాట 'ఓ మై గాడ్‌ డాడీ' సాంగ్‌ని తప్ప మిగతా 'అల వైకుంఠపురములో' పాటలని బీట్‌ చేయలేకపోయింది.

కనీసం ఆ పాటల ట్రెండింగ్‌కి దగ్గరలో కూడా లేదు కాబట్టి దీనికి ఓవరాల్‌గా అన్ని వ్యూస్‌ వచ్చే ఛాన్సే లేదనిపిస్తోంది. ఇప్పుడిక మిగతా పాటలు విడుదల చేయాలి కనుక దేవికి అప్పుడు ట్రోల్స్‌ బెడద ఇంక ఏ రేంజ్‌లో వుంటుందనేది ఊహించుకోవడమే కష్టమనాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English