కొత్త సినిమా.. ఏది ఎందులో చూడొచ్చంటే?

 కొత్త సినిమా.. ఏది ఎందులో చూడొచ్చంటే?

ఒక కొత్త సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం ఒకప్పటి కథ. ఆ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ఎప్పుడు రిలీజవుతుంది.. ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంటుంది అని ఎదురు చూడటం నేటి ట్రెండ్. ఒక సినిమా డిజిటల్ హక్కుల్ని ఎవరు సొంతం చేసుకుంటారన్నది కూడా ఇప్పుడు పెద్ద వార్త అయిపోతోంది.

జనాలు తమ అవసరాల్ని, ఫినాన్షియల్ కెపాసిటీని బట్టి వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఎంత కంటెంట్ ఉందో.. కొత్త సినిమాల్ని ఎక్కువగా ఏ సంస్థ కొనుగోలు చేస్తోందో చూసుకుని సబ్‌స్క్రిప్షన్ గురించి ఆలోచిస్తున్నారు. తమకు సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఫ్లాట్‌ఫామ్స్‌లోకి కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సమాచారం. తెలుగులో ఈ మధ్యే విడుదలైన, త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాల డిజిటల్ హక్కులు ఎవరికి సొంతమయ్యాయో ఒకసారి చూద్దాం.

సంక్రాంతికి రాబోయే అతి భారీ చిత్రాలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' డిజిటల్ హక్కుల డీల్స్ పూర్తయినట్లు సమాచారం. 'సరిలేరు..' అమేజాన్ ప్రైమ్ సొంతం అయింది. విడుదలైన 50 రోజులకే ఈ చిత్రం ప్రైమ్‌లోకి వచ్చే అవకాశముంది. మరోవైపు 'అల..' సినిమా డిజిటల్ హక్కులు అమ్మలేదంటూ ఆ మధ్య ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ పోస్టర్ల మీద వేసుకున్నాడు కానీ.. ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ వాళ్లు సొంతం చేసుకున్నారన్నది తాజా సమాచారం.

ఈ మధ్య దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ.. మరిన్ని కొత్త సినిమాల్ని కొనుగోలు చేసింది. రూలర్, భీష్మ, వి, డిస్కో రాజా లాంటి క్రేజీ సినిమాలు ఆ సంస్థ సొంతం అయ్యాయి. 'తిప్పరా మీసం' హక్కుల్ని కూడా అదే తీసుకుంది. హాట్ స్టార్ వాళ్లు 'మీకు మాత్రమే చెప్తా', 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లతో పాటు.. క్రిస్మస్‌కు రానున్న క్రేజీ మూవీ 'ప్రతి రోజూ పండగే' హక్కుల్ని కూడా ఈ సంస్థే సొంతం చేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English