అల్లు వారి 'ప్రైమ్'లో తొలి సినిమా అదే..

అల్లు వారి 'ప్రైమ్'లో తొలి సినిమా అదే..

అమేజాన్ ప్రైమ్ రంగ ప్రవేశంతో సినిమాల బిజినెస్ డైనమిక్స్ ఎలా మారిపోయాయో తెలిసిందే. దీంతో పాటు హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్, జీ5.. లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేగంగా విస్తరిస్తున్నాయి.

భవిష్యత్ వీటిదే అని.. థియేటర్లకు గడ్డు కాలం తప్పదని అంటున్నారు నిపుణులు. అవ్వడానికి పాత కాలం నిర్మాతే కానీ.. ట్రెండుకు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. భవిష్యత్ దిశగా ఓ కీలక ముందడుగు వేశారు. ఆయన సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ జోరుగానే నడుస్తున్నట్లు సమాచారం. అరవింద్‌తో మరికొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నట్లు సమాచారం.

అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లోనే అల్లు వారి ఓటీటీ ఫ్టాట్ ఫామ్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. అందులో మొదటగా ప్రదర్శించబోయే కొత్త సినిమా టాలీవుడ్ లేటెస్ట్ హిట్ 'అర్జున్ సురవరం'యేనట. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అరవింద్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం అనేక అడ్డంకుల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సమయంలో ఆ చిత్ర బృందానికి అండగా నిలిచి ఆ సినిమాను బయటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అరవిందే.

ఆ సమయంలోనే డిజిటల్ హక్కుల ఒప్పందం కూడా పూర్తయిందట. దీంతో పాటు అరవింద్ సొంత సినిమాలు, మరికొన్ని బయటి సినిమాల్ని ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది. జనాల స్పందన, మార్కెట్ డైనమిక్స్ అన్నీ చూసుకుని మున్ముందు అగ్రెసివ్‌గా సినిమాల కొనుగోలు చేసే అవకాశముందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English