ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంత?

 ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంత?

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ అభిమానగణం ఏ స్థాయికి పెరిగిందో.. అతడి మార్కెట్ ఎలా విస్తరించిందో తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే ‘సాహో’ సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచుకుంటూ వెళ్లిపోయారు. ఏకంగా రూ.300 కోట్లకు పైనే ఖర్చు పెట్టినట్లు చెప్పుకున్నారు. తెర మీద మరీ అంత ఖర్చు కనిపించకపోయినా.. భారీతనం అయితే కనిపించింది. కానీ ఆ భారీతనం సినిమాకు ఎంత వరకు ఉపయోగపడిందంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం.

 ఈ సినిమా ప్రతికూల ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ప్రభాస్ తర్వాతి సినిమాకు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి తలెత్తింది. బడ్జెట్, భారీతనం మీద కాకుండా కంటెంట్ మీద శ్రద్ధ పెడితే బెటర్ అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రభాస్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత?

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు కూడా తక్కువేమీ ఖర్చు కావట్లేదట. ‘సాహో’ టైంలోనే దీని ప్రొడక్షన్ డిజైన్ కూడా పూర్తయింది. ఐతే ఇది ‘సాహో’ లాంటి యాక్షన్ ప్రధానమైన సినిమా కాదు కాబట్టి ఆ స్థాయిలో అయితే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ పునర్జన్మల నేపథ్యంలో కథ కావడం.. ఒకప్పటి కాలమాన పరిస్థితుల్ని తెరమీదికి తేవడానికి భారీగా సెట్టింగ్స్, ఇతర ఖర్చు చాలానే అయ్యేట్లుండటం.. విదేశాల్లో చాలా రోజుల చిత్రీకరణ.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు.

కానీ ‘సాహో’ ఫలితం చూశాక ప్రొడక్షన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ తగ్గించినట్లు తెలుస్తోంది. రూ.150 కోట్ల దాకా ఖర్చు కావచ్చన్న అంచనాతో ఉన్నారట. ఐతే సినిమా పూర్తయ్యేసరికి రూ.20-30 కోట్లకు ఎక్కువ కూడా కావచ్చన్న అంచనాతో ఉన్నారట. గరిష్టంగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English