మారుతి సెంటిమెంటు ఫ‌లిస్తే సూప‌ర్ హిట్టే..

మారుతి సెంటిమెంటు ఫ‌లిస్తే సూప‌ర్ హిట్టే..

యువ ద‌ర్శ‌కుడు మారుతి కెరీర్‌ను భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌కి మందు, త‌ర్వాత అని విభ‌జించి చూడాలి. ఆ సినిమా ముందు వ‌ర‌కు అత‌డికి బూతు ద‌ర్శ‌కుడిగా పేరుండేది. అంత‌కుముందు మారుతి తీసిన సినిమాల‌న్నీ స‌క్సెసే అయినా అత‌డిపై ప్రేక్ష‌కుల్లో అంతగా గౌర‌వం ఉండేది కాదు.

కానీ నిల‌దొక్కుకునే వ‌ర‌కు బూతుతో యూత్‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసిన మారుతి.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో రూటు మార్చేశాడు. చ‌క్క‌టి ఫ్యామిలీ మూవీతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్నాడు. ఐతే ఆ సినిమా ద‌గ్గ‌ర్నుంచి మారుతిని ఓ సెంటిమెంటు వెంటాడుతోంది.

ఒక పెద్ద సూప‌ర్ హిట్ ఇచ్చాక త‌న‌పై పెట్టుకునే భారీ అంచ‌నాల్ని అత‌ను అందుకోలేక‌పోతున్నాడు. భ‌లే భ‌లే.. త‌ర్వాత మారుతి తీసిన బాబు బంగారు ఫ్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌పై అంచ‌నాలు త‌గ్గిన స‌మ‌యంలో మ‌హానుభావుడుతో మ‌ళ్లీ హిట్ కొట్టి త‌నేంటో రుజువు చేసుకున్నాడు మారుతి. కానీ ఆ త‌ర్వాత అంచ‌నాలు పెంచుకుంటే శైల‌జా రెడ్డి అల్లుడు లాంటి ఫ్లాప్ అందించాడు.

త‌ర్వాత అత‌డిపై ఆశ‌లు అంచ‌నాలు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ప్ర‌తి రోజూ పండ‌గే సినిమాను మొద‌లుపెట్టాడు. ఈ సినిమా ప్రోమోలు చూస్తే సూప‌ర్ హిట్ ప‌క్కా అనిపిస్తోంది. క్రిస్మ‌స్ సెల‌వుల్లో మంచి టైమింగ్ చూసుకుని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మంచి టాక్ వ‌స్తే ఫ్యామిలీస్ థియేట‌ర్ల‌కు ప‌రుగులుపెట్ట‌డం, సూప‌ర్ హిట్ అందించ‌డం ఖాయంగా ఉంది. మారుతి ఫ్లాప్ త‌ర్వాత హిట్ సెంటిమెంటు ఫ‌లిస్తుందేమో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English