ఇలియానాకు అంత సీనుందా?

ఇలియానాకు అంత సీనుందా?

సినిమాలతో కంటే బయటి వ్యవహారాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఇలియానా. బాలీవుడ్‌కు వెళ్లాక ఎక్కడలేని బోల్డ్‌నెస్ తెచ్చిపెట్టుకున్న ఆమె తరచుగా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటుంది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో తన ప్రేమాయణం, పెళ్లి, బ్రేకప్.. వీటన్నిటి గురించి ఆయా సందర్భాల్లో చాలా బోల్డ్‌గా మాట్లాడింది.

తన ఫిజిక్ గురించి, సినిమాల గురించి కూడా ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా ఒక షాకింగ్ విషయం చెప్పింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘వాంటెడ్’, ‘కిక్’ సినిమాల్లో కథానాయికగా ముందు తననే అడిగారని.. కానీ తనకు డేట్లు సర్దుబాటు కాక ఈ సినిమాలు ఒప్పుకోలేదని ఇలియానా చెప్పింది.

కానీ సల్మాన్ ఖాన్ సినిమాలకు నో చెప్పేంత సీన్ ఆయా సమయాల్లో ఇలియానకు ఉందా అన్నది డౌటు. ఇలియాన చెబుతున్న ‘వాంటెడ్’, ‘కిక్’ సినిమాల ఒరిజినల్స్‌లో ఆమే కథానాయికగా నటించింది. ఐతే ‘వాంటెడ్’ టైంలో తెలుగులో ఆమె బిజీగా ఉన్న మాట వాస్తవం. అంతమాత్రాన హిందీలో సల్మాన్ సరసన దీని రీమేక్‌లో నటించమంటే నో చెప్పి ఉంటుందా అన్నది డౌటే. ఇక ‘కిక్’ హిందీలోకి రీమేక్ అయ్యే సమయానికైతే తెలుగులోనూ ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది.

బాలీవుడ్ ఆఫర్ అంటే పరుగెత్తుకెళ్లే స్థితిలో ఉంది. పైగా అప్పటికి సల్మాన్ ఊపు మామూలుగా లేదు. ‘కిక్’ రీమేక్ అంటే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుని ఉండాలి. కానీ ఇలియానా ఏమో.. తాను ఆ సినిమాల్ని వదులుకున్నట్లు బడాయి పోతోంది. ఎలాగూ ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించిన వాళ్లు పనిగట్టుకుని ఈమె కామెంట్లను ఖండించరు కాబట్టి ఇల్లీ బేబీ ఈ స్టేట్మెంట్లు ఇచ్చేసిందేమో అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English