బాద్ షా చెన్నైకి వెళ్తున్నాడు!

బాద్ షా చెన్నైకి వెళ్తున్నాడు!

ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయితే, దాన్ని ఎప్పుడెప్పుడు రీమేక్ చేసేద్దామా అని మిగతా భాషల వాళ్లు హడావుడి పడిపోతుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో ఈ హంగామా మరీ ఎక్కువ. ఇప్పడు బాద్ షా సినిమా కోసం అలాగే ఎగబడుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ నటించిన బాద్ షా యావరేజ్ అనిపించుకుంది. దూకుడు సీక్వెల్ లా ఉంది అంటూ నెగిటివ్ కామెంట్లు కూడా మూటగట్టుకుంది. అయితే ఆ సినిమా కోసం బాలీవుడ్, కోలీవుడ్ పోటీ పడుతోందిప్పుడు. సల్మాన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ ఉవ్విళ్లూరాడు. కానీ బండ్ల గణేష్ కాస్త ఎక్కువ రేటు చెప్పేసరికి భయపడి వెనక్కు తగ్గాడు.

కానీ ఆ సినిమా చూసిన రజనీకాంత్ మాత్రం ఎలాగైనా దాన్ని రీమేక్ చేయమంటూ కొందరు తమిళ నిర్మాతలకు గట్టిగా చెప్పారు. దాంతో ఆయనే అందులో నటించనున్నారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కాదు, ఆయన అల్లుడు ధనుష్ చేస్తున్నాడని తెలిసింది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అన్నీ బాగా కుదిరాయని, రీమేక్ చేస్తే తప్పక హిట్టవుతుందని రజనీ చెప్పడంతో తమిళ నిర్మాత ఒకరు వెంటనే రైట్స్ కొనేశాడు. ధనుష్ తో సినిమా తీయడానికి సన్నాహాలు కూడా మొదలెట్టేశాడు. మరి కోలీవుడ్లో అయినా బాద్ షా సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English