సాయి ధరమ్‌ ఆ సినిమా మిస్‌ అయినా...

సాయి ధరమ్‌ ఆ సినిమా మిస్‌ అయినా...

సాయి ధరమ్‌ తేజ్‌ అప్పట్లో ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దామని చూసేవాడు. అప్పుడే అతనికి హరీష్‌ శంకర్‌ వద్ద రచనా విభాగంలో పని చేస్తోన్న సతీష్‌ వేగేశ్న 'శతమానం భవతి' కథ చెబితే, దానిని దిల్‌ రాజుకి తేజ్‌ రిఫర్‌ చేసాడు. తీరా పంపించిన హీరోని పక్కనపెట్టి ఆ కథని శర్వానంద్‌తో చేసేసారు.

అలా ఒక బ్లాక్‌బస్టర్‌ సినిమా మిస్‌ అయిపోయిన తేజ్‌ ఇప్పుడు ఆ కథని పోలి వున్న కాన్సెప్ట్‌తో 'ప్రతి రోజు పండగే' చేస్తున్నాడు. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ సినిమా చేయాలని వుందనే సాయి ధరమ్‌ తేజ్‌ కోరిక తెలిసిన మారుతి ఈ కథ రాసాడు. అందుకేనేమో ఈ రెండు కథల మధ్య అన్ని పోలికలు! అయితే ఈ సినిమా చూడగానే శతమానం భవతి అనేస్తారని తెలిసిన మారుతి తెలివిగా ఆ పాయింట్‌ని తానే చెప్పేసి, దానిని ట్రెయిలర్‌లో కూడా పెట్టేసి విమర్శకులని తగ్గించేసాడు.

అయితే శతమానం భవతి ఎక్కువ ఎమోషనల్‌గా వుంటే ఈ చిత్రం మాత్రం పూర్తిగా హాస్య ప్రధానంగా సాగుతుంది. చనిపోయే వ్యక్తిని ఏడుస్తూ కాకుండా నవ్వుతూ సాగనంపాలనేదే ఈ చిత్రం ముఖ్యోద్దేశం. మరి సాయి ధరమ్‌ తేజ్‌కి ఇది 'శతమానం భవతి' మిస్‌ అయిన లోటుని పూడ్చేస్తుందా? ఇది కూడా ఆ సినిమాలా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English