ఇదే మాట మీరు చిరంజీవిని అడ‌గ్గ‌ల‌రా

ఇదే మాట మీరు చిరంజీవిని అడ‌గ్గ‌ల‌రా

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో మ‌మ్ముట్టి ఒక‌రు. ఆయ‌న తెలుగులో రెండు ప్ర‌త్యేక‌మైన సినిమాల్లో న‌టించారు. అందులో ఒక‌టి స్వాతికిర‌ణం కాగా.. ఇంకోటి యాత్ర‌. ఈ రెండు సినిమాల మ‌ధ్య పాతికేళ్ల‌కు పైగా విరామం ఉండ‌టం విశేషం. ఐతే మ‌ధ్య‌లో మ‌మ్ముట్టికి తెలుగు నుంచి ఆఫ‌ర్లు రాకేమీ కాదు.

అయినా తాను అంగీక‌రించ‌లేద‌ని.. వైఎస్ బ‌యోపిక్ అనేస‌రికి యాత్ర చేయ‌డానికి ముందుకొచ్చాన‌ని ఇంత‌కుముందే ఆయ‌న వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే.. మ‌ధ్య‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో విల‌న్ పాత్ర‌కు మ‌మ్ముట్టిని అడిగార‌ట‌. అల్లు అర‌వింద్ ఆయ‌న్ని అడిగితే.. బ‌దులుగా ఒక ప్ర‌శ్న వేసి ఆయ‌న సైలెంట్ అయ్యేలా చేశాడ‌ట మ‌మ్ముట్టి.

మ‌మ్ముట్టి కొత్త సినిమా మామంగంకు సంబంధించిన ప్రెస్ మీట్లో అర‌వింద్ మాట్లాడుతూ.. ప‌దేళ్ల కింద‌ట ప‌వ‌న్ హీరోగా చేస్తున్న‌ సినిమాలో విల‌న్ పాత్ర చాలా బాగుంది చేస్తారా అని మ‌మ్ముట్టికి తాను ఫోన్ చేస్తే.. ఇదే మాట మీరు చిరంజీవిని అడ‌గ్గ‌ల‌రా అని ఎదురు ప్ర‌శ్న వేశాడ‌ట మ‌మ్ముట్టి. అడ‌గ‌లేను అన‌గానే.. మ‌రి న‌న్నెందుకు అడుగుతున్నారు అని మ‌మ్ముట్టి అన‌డంతో తాను ఏమీ మాట్లాడ‌కుండా సైలెంట్ అయిపోయాన‌ని అర‌వింద్ వెల్ల‌డించాడు.

ఆ సినిమా పేరేదో అర‌వింద్ చెప్ప‌లేదు కానీ.. ప‌దేళ్ల కింద‌ట ప‌వ‌న్‌తో అర‌వింద్ చేసిన సినిమా అంటే అది జ‌ల్సానే అయ్యుంటుంది. అందులో ముఖేష్ రుషి పాత్ర‌కు మ‌మ్ముట్టిని అడిగార‌న్న‌మాట‌. ఐతే మ‌ల‌యాళంలో సూప‌ర్ స్టార్ అయిన మ‌మ్ముట్టి తెలుగులో ప‌వ‌న్‌కు విల‌న్‌గా చేయ‌మంటే ఎలా అంగీక‌రిస్తారు. అయినా.. ఆయ‌న చేయ‌ద‌గ్గ ప్ర‌త్యేక‌మైన పాత్ర కూడా కాదు అది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English