ఫాల్స్‌ హైప్‌ సృష్టిస్తోన్న కార్తికేయ

ఫాల్స్‌ హైప్‌ సృష్టిస్తోన్న కార్తికేయ

ఏ సినిమాపై ఎంత క్రేజ్‌ వుందనేది తెలుసుకోవడంలో, ప్రీ రిలీజ్‌ బజ్‌ని అంచనా వేయడంలో 'బుక్‌మైషో.కామ్‌' వెబ్‌సైట్‌లో ఫలానా చిత్రం కోసం ఎంత మంది 'ఇంట్రెస్టెడ్‌'గా వున్నారని తెలుసుకుంటూ వుంటారు. చిన్న సినిమాలకి 'ఆసక్తి' చూపించే వాళ్లు పెద్దగా కనిపించరు. పెద్ద చిత్రాలకి మాత్రం 'ఇంట్రెస్టెడ్‌' అని చాలా మంది క్లిక్‌ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది ఆసక్తి చూపించే చిత్రానికి బుకింగ్స్‌ కూడా అదే స్థాయిలో స్పీడ్‌గా జరుగుతుంటాయి. ఒకవేళ సదరు చిత్ర బృందమే ఎక్కువ మంది దీనిపై ఆసక్తిగా వున్నారనే ఫాల్స్‌ హైప్‌ సృష్టించినా కానీ బుకింగ్‌ ట్రెండ్స్‌లో మాత్రం అసలు సంగతి తెలిసిపోతుంది.

ఇక విషయానికి వస్తే '90 ఎంఎల్‌' అనే టైటిల్‌ చూసి 'తాగుడు' అంటే ఇష్టం వున్న యువత అంతా కనక్ట్‌ అయిపోతారని భావించాడు కార్తికేయ. అందుకే 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేసాడు. కానీ ఈ చిత్రం పట్ల ఎవరికీ అంత ఆసక్తి కలగలేదు. ట్రెయిలర్‌ కూడా చాలా వీక్‌ అనిపించడంతో దీని పట్ల ఇంట్రెస్ట్‌ అంతగా లేదు. కానీ వేల మంది ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్టు ఫేక్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. కానీ బుకింగ్స్‌ మాత్రం ఆ ఆసక్తికి కనీసం దరిదాపులో కూడా లేవు. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ఒక్క హిట్‌ కూడా లేని కార్తికేయ ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English