అల వైకుంఠపురములో కూడా కాపీనే!

అల వైకుంఠపురములో కూడా కాపీనే!

రచయితగా అత్యంత కీర్తి ప్రతిష్టలు గడించిన త్రివిక్రమ్‌ కొంత కాలంగా కొత్త ఐడియాలు రాక ఇతరుల కథల్ని కాపీ కొడుతున్నాడు. 'అఆ' చిత్రానికి మీనా కథని కాపీ చేసి క్రెడిట్స్‌ కూడా ఇవ్వకుండా అభాసుపాలయ్యాడు. ఆ తర్వాత అజ్ఞాతవాసికి ఫ్రెంచి సినిమా 'లార్గో వించ్‌' కథని తీసుకొచ్చేసి ట్విట్టర్‌లో ఒరిజినల్‌ దర్శకుడితో అక్షింతలు వేయించుకున్నాడు. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' చిత్రానికి కూడా బేసిక్‌ ప్లాట్‌ని త్రివిక్రమ్‌ కాపీ కొట్టేసాడట.

ఇందులో చిన్నప్పుడే తల్లిదండ్రులనుంచి విడిపడిన ఇద్దరు పిల్లలు ఒకరి స్థానంలో మరొకరు పెరిగి పెద్దవారవుతారు. చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమై పేదరికంలో పెరిగిన హీరో తన తల్లిదండ్రులెవరో తెలుసుకుని, వారి ఇంట్లోనే పని వాడిగా చేరి అక్కడున్న పరిస్థితులు చక్కదిద్దుతాడు. 1958లో వచ్చిన ఎన్టీఆర్‌, సావిత్రిల చిత్రం 'ఇంటిగుట్టు' నుంచి త్రివిక్రమ్‌ ఈ ఐడియా కాపీ చేసాడు. అలాగే హీరోహీరోయిన్ల ట్రాక్‌ కోసం ఒక మలయాళ చిత్రం నుంచి ఐడియా స్టీల్‌ చేసాడని రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

మొత్తమ్మీద గురూజీగా అంతా గౌరవంగా పిలుచుకునే త్రివిక్రమ్‌ ప్రస్తుతం కథల కోసం పాత సినిమాల సీడీలపై ఆధారపడుతున్నట్టు అర్థమవుతోంది. హిందీలో అఫీషియల్‌గా పాత సినిమాలని మళ్లీ రీమేక్‌ చేస్తూ వుంటే త్రివిక్రమ్‌ అనఫీషియల్‌గా కథాచౌర్యం చేసేస్తున్నాడనేది విమర్శలకి తావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English