వెంకీ మామ హార్డ్ హిట్టింగ్

వెంకీ మామ హార్డ్ హిట్టింగ్

సంక్రాంతికి రాబోయే సినిమాల రిలీజ్ డేట్లు మూణ్నాలుగు నెలల ముందే ఖరారయ్యాయి. క్రిస్మస్ వీకెండ్‌కు అనుకున్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా చాలా ముందుగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ప్రమోషన్లు చేసుకుంటూ వస్తున్నారు. ఆయా సినిమాల రిలీజ్ డేట్లు ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయిపోయాయి.

కానీ ‘వెంకీ మామ’ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ నడిచింది. ఇటు ప్రేక్షకుల్ని, అటు వేరే నిర్మాతల్ని బాగా టెన్షన్ పెట్టి చివరికి డిసెంబరు 13న రిలీజ్ అంటూ ప్రకటించేేశారు. ఈ ప్రకటన విడుదలకు ఇంకో 11 రోజులు మాత్రమే ఉండగా చేసింది కావడం విశేషం. ఇక ఇప్పట్నుంచి ఎంతో అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి సినిమా వెళ్తుంది. రిలీజ్ డేట్ రిజిస్టర్ అవుతుంది. విడుదల సమయానికి హైప్ పెరుగుతుంది.

ఐతే సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అంటే.. రిలీజ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో.. ప్రమోషన్లు ఎలా చేస్తారో చెప్పేదేముంది? అందులోనూ ఆ బేనర్లో చాలా కాలం తర్వాత వస్తున్న పెద్ద సినిమా.. పైగా రామానాయుడు కలలు కన్న మామా అల్లుళ్ల (వెంకీ-చైతూ) కాంబినేషన్లో వస్తున్న సినిమా. కాబట్టి హంగామా మామూలుగా ఉండబోదని సంకేతాలు ఇచ్చేశారు. నిన్న సాయంత్రం రిలీజ్ డేట్ ఇచ్చినప్పట్నుంచి వరుసబెట్టి పోస్టర్లు దించుతున్నారు. ఇక వరుసబెట్టి పాటలూ రిలీజ్ చేయబోతున్నారు.

త్వరలోనే ఫుల్ ఆడియో వదిలేస్తున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌గా చేయడానికి ఫిక్సయ్యారు. గత కొన్నేళ్లలో తన బేనర్లో వచ్చిన మరే సినిమాకూ లేని స్థాయిలో ఈ చిత్రానికి పబ్లిసిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట సురేష్. పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలతో పాటు.. బయట కూడా ఫ్లెక్సీలు, హోర్డింగులతో ‘వెంకీ మామ’ ప్రచారాన్ని హోరెత్తించి సినిమా రిలీజ్ టైంకి హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English