బాలయ్యకు బ్యాండ్ తప్పదా?

బాలయ్యకు బ్యాండ్ తప్పదా?

నందమూరి బాలకృష్ణ ఏడాది మధ్యలో ఏదైనా సినిమా మొదలుపెట్టాడంటే కచ్చితంగా తర్వాతి ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తాడు. ఆ సీజన్లో పోటీగా ఎంత పెద్ద సినిమాలున్నా.. ఎన్ని ఉన్నా పట్టించుకోడు. చాలా ధీమాగా బరిలోకి దిగేస్తాడు. కానీ ఈ ఏడాది 'యన్.టి.ఆర్ కథానాయకుడు' ఫలితం చూశాక బాలయ్య ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్నట్లుంది.

పైగా 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' లాంటి భారీ చిత్రాల మధ్య పోటీకి దిగితే తన సినిమా 'రూటర్' పచ్చడైపోవడం ఖాయమని వాస్తవం బోధపడ్డట్లుంది. అందుకే మూడు వారాల ముందు క్రిస్మస్ సీజన్లో తన సినిమాను రిలీజ్ చేయాలని భావించాడు. కానీ ఈ సీజన్లో కూడా బాలయ్య సినిమా సేఫ్ అనుకోవడానికేమీ లేదనిపిస్తోంది.

20న 'రూలర్' రిలీజవుతుండగా.. ముందు వారం 'వెంకీ మామ'ను వదులుతున్నారు. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. 'ఎఫ్-2' తర్వాత వెంకీ, 'మజిలీ' తర్వాత చైతూ కలిసి నటించిన ఈ చిత్రంపై అంచనాలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. టాక్ బాగుంటే ఈ సినిమా జోరు వారానికి పరిమితం అయ్యే అవకాశాలు లేవు. అది అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే చిత్రంలా అనిపిస్తోంది.

మరోవైపు 20న 'రూలర్'కు పోటీగా వస్తున్న 'ప్రతి రోజూ పండగే' మీదా మంచి అంచనాలున్నాయి. అది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా అనిపిస్తోంది. ఇంకోవైపు 'దబంగ్-3' లాంటి మాస్ సినిమా.. 'ఇద్దరి లోకం ఒకటే' లాంటి ప్రేమకథ.జ. 'మత్తు వదలరా' లాంటి కాన్సెప్ట్ బస్డ్ మూవీ కూడా క్రిస్మస్ సీజన్లోనే రాబోతున్నాయి.

ఇటు చూస్తే 'రూలర్' సినిమా ముతక కథతో తెరకెక్కిన రొటీన్ మూవీలా ఉంది. దీని టీజర్ పేలవంగా అనిపించింది. ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. బాలయ్య లుక్స్ కామెడీగా అనిపించాయి. సినిమాపై బాలయ్య అభిమానుల్లోనూ పెద్దగా అంచనాల్లేవు. ఇలాంటి బజ్‌తో, ఇంత పోటీ మధ్య వస్తున్న బాలయ్య సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బ్యాండ్ తప్పదేమో అనిపిస్తోంది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English