చైతూ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చూడబోతున్నామా?

చైతూ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చూడబోతున్నామా?

అభిమానులు కోరుకున్నట్లుగా పెద్ద మాస్ హీరో కాలేకపోయాాడు కానీ..  అక్కినేని నాగచైతన్య మంచి పెర్ఫామర్ అనే విషయం కెరీర్ ఆరంభంలోనే మంచి పెర్ఫామర్‌గా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘మజిలీ’ సినిమాతో నటుడిగా అతను మరి కొన్ని మెట్లు పైకెక్కాడు. ఇప్పుడిక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాతో అతను కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడన్నది చిత్ర వర్గాల సమాచారం.

మామూలుగా శేఖర్ సినిమాల్లో హీరోయిన్లే హైలైట్ అవుతుంటారు. వాళ్ల కెరీర్లో నిలిచిపోయే పాత్రలతో ఎక్కడ లేని గుర్తింపు సంపాదిస్తుంటారు. ‘ఆనంద్’, ‘గోదావరి’ సినిమాల్లో కమలిని ముఖర్జీ.. ‘ఫిదా’లో సాయిపల్లవిల పాత్రలు ఎంత బలంగా ఉంటాయో.. అవి ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో..  ఆ హీరోయిన్లకు ఎంత పేరు తెచ్చాయో తెలిసిందే. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు బాగుంటాయి కానీ.. హీరోయిన్ల స్థాయిలో అయితే హైలైట్ కావు.

ఐతే కమ్ముల కొత్త సినిమాలో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం చూడబోతున్నామట. ఇందులోనూ హీరోయిన్‌గా సాయిపల్లవే చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రకూ ప్రాధాన్యం ఉంటుందట కానీ.. చైతూనే సినిమాలో హైలైట్ అవుతాడట. ‘ఫిదా’ టీజర్లో సాయిపల్లవిని హైలైట్ చేసి చూపించిన కమ్ముల.. తన కొత్త సినిమా టీజర్‌ను మాత్రం చైతూకే డెడికేట్ చేశాడు. అతడి పాత్ర హృద్యంగా, యూత్ రిలేట్ చేసుకునేలా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమైంది.

ఈ సినిమా కోసం చైతూ తొలిసారిగా తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాాడు. దీని కోసం వర్క్ షాపుల్లో పాల్గొని చాలానే కసరత్తు చేశాడట. తెలంగాణ యువకుడిగా అతను ఒదిగిపోయిన వైనం, సంభాషణలు పలికిన వైనం చూసి ఆశ్చర్యపోతారని.. తన పెర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్‌గా అనిపిస్తుందని ఒక ఇంటర్వ్యూలో కమ్ముల చెప్పడం విశేషం. కమ్ముల ఈ రేంజిలో చెబుతున్నాడంటే ఈ సినిమాతో చైతూ తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English