క్రిస్మ‌స్ బాక్సాఫీస్ వార్.. మ‌నోళ్లు స‌రిపోర‌ని

క్రిస్మ‌స్ బాక్సాఫీస్ వార్.. మ‌నోళ్లు స‌రిపోర‌ని

కొంత కాలంగా అంద‌రూ వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో నెల‌కొన్న ర‌స‌వ‌త్త‌ర‌ పోటీ గురించే మాట్లాడుకుంటున్నారు కానీ.. అంత‌కంటే ముందు క్రిస్మ‌స్ సీజ‌న్లో బాక్సాఫీస్ వార్ గురించి ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఆ సీజ‌న్లో ఒక‌టికి మూడు పేరున్న సినిమాలు రిలీజ‌వుతున్నాయి.

డిసెంబ‌రు 20న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా రూల‌ర్‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ మూవీ ప్ర‌తి రోజూ పండ‌గే విడుద‌ల కానున్నాయ‌న్న‌ది ఎప్పుడో వెల్ల‌డైన స‌మాచారం. వీటికి తోడుగా వెంకీ మామ సినిమాను సైతం క్రిస్మ‌స్ సీజ‌న్లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత సురేష్ బాబు నిర్ణ‌యించాడంటున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి డిసెంబ‌రు 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఇవి చాల‌వ‌న్న‌ట్లు హిందీ డ‌బ్బింగ్ మూవీ ద‌బంగ్‌-3ని డిసెంబ‌రు 20కే షెడ్యూల్ చేశారు. ఈ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించ‌డ‌మే క‌ష్ట‌మ‌య్యేలా ఉంది. అలాంటిది క్రిస్మ‌స్ పోటీలోకి మ‌రో సినిమా వ‌చ్చి ప‌డింది. కార్తి న‌టించిన ద్విభాషా చిత్రం దొంగ‌ను కూడా డిసెంబ‌రు 20నే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ చిత్రాన్ని త‌మిళంలో ఆ తేదీకి రిలీజ్ చేయ‌డంలో పెద్ద ఇబ్బంది లేక‌పోవ‌చ్చు. కానీ తెలుగులో మాత్రం క్రిస్మ‌స్ రిలీజ్ అంటే క‌ష్టమే.

క‌నీస స్థాయిలో కూడా థియేట‌ర్లు దొర‌క‌వు. లేక లేక ఖైదీ సినిమాతో మంచి హిట్టు కొట్టి తెలుగులో మ‌ళ్లీ మార్కెట్ సంపాదించుకున్న కార్తి.. ఇక్క‌డి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకోకుండా దొంగ సినిమాను క్రిస్మ‌స్‌కు షెడ్యూల్ చేయ‌డం తెలివైన నిర్ణ‌యం కాదనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English