కొత్త సినిమా రిలీజ్.. అమెరికాలో మాత్రమే

కొత్త సినిమా రిలీజ్.. అమెరికాలో మాత్రమే

తెలుగులో రిలీజయ్యే ప్రతి సినిమా అమెరికాలో రిలీజవదు. అన్నిటికీ అక్కడ బజ్ ఉండదు. చిన్న సినిమాలకు యుఎస్ రిలీజ్ అంటే అంత సులువేమీ కాదు. కానీ ఇప్పుడో చిన్న చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయట్లేదు. వినడానికి చాలా చిత్రంగా అనిపించినా ఇది నిజం. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రం చూడబోతున్నాం.

ఆ చిన్న సినిమా పేరు.. మథనం. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో బాలనటుడిగా మెప్పించి.. ఆ తర్వాత ‘మిణుగురులు’ సహా మరికొన్ని చిత్రాల్లో మెరిసిన శ్రీనివాస్ సాయి హీరోగా నటించిన ఈ చిత్రంతో భావన కథానాయికగా పరిచయం అవుతోంది. అజయ్ సాయి మణికందన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌తో ఈ సినిమా ఆకట్టుకుంది. ఇదో క్లాస్ లవ్ స్టోరీ అని.. ఇంటెన్స్‌గా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇలాంటి క్లాస్ ప్రేమకథలు యుఎస్ ప్రేక్షకులకు నచ్చుతాయి. కానీ సినిమాకు స్టార్ కళ లేదు. అందరూ కొత్తవాళ్లు, పెద్దగా పేరు లేని వాళ్లే ఉన్నారు. అయినా సరే.. ధైర్యంగా అమెరికాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కానీ కేవలం అమెరికాలో మాత్రమే రిలీజ్.. తెలుగు రాష్ట్రాల్లో నో రిలీజ్ అనడమే విడ్డూరంగా ఉంది. దీని వెనుక లాజిక్ ఏంటన్నది అర్థం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పట్టించుకోరని అనుకుంటున్నారా.. లేక ముందు యుఎస్‌లో రిలీజ్ చేసి అక్కడ స్పందనను బట్టి ఇక్కడ రిలీజ్ చేస్తారా.. లేక కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English