నితిన్ సంచలన నిర్ణయం?

నితిన్ సంచలన నిర్ణయం?

‘అఆ’ సినిమా తర్వాత నితిన్ రేంజ్ మారినట్లు కనిపించింది. కానీ ‘లై’, ‘చల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలతో వరుసగా మూడు ఫ్లాపులు ఎదురవడంతో అతడి జోరు తగ్గింది. దీంతో ఏడాదిపైగా గ్యాప్ తీసుకుని మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. ‘భీష్మ’, ‘దిల్ సే’లతో పాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాల్ని లైన్లో పెట్టాడతను. వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలతో అతను సందడి చేయబోతున్నాడు.

ఈలోపు ఒక సెన్సేషనల్ మూవీ రీమేక్‌లో నితిన్ నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ సినిమానే.. హిందీ బ్లాక్ బస్టర్ ‘అంధాదున్’. గత ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఇదొకటి. చిన్న సినిమాగా విడుదలై దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధించిందీ సినిమా. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశాడు.

దీన్ని సరిగ్గా తెలుగులో తెరకెక్కించే దర్శకుడి కోసం కొంత కాలంగా వేట సాగుతోంది. సుధీర్ వర్మను దర్శకుడిగా ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. మంచి ఛాయిసే అని అంతా అనుకున్నారు. ఐతే ఈ సినిమా గురించి ఇప్పుడో సంచలన రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో తాను హీరోగా నటించకూడదని నితిన్ నిర్ణయించుకున్నాడట. తన బదులు వేరే యంగ్ హీరోకు ఛాన్సివ్వాలనుకుంటున్నాడట. దర్శకుడిగా కూడా సుధీర్ పేరు ఖరారు కాలేదని.. ఒక కొత్త దర్శకుడు దీన్ని రూపొందిస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తండ్రి తన కోసం హక్కులు కొంటే.. నితిన్ మాత్రం తనకంటే ఇమేజ్ లేని వేరే యంగ్ హీరో అయితే ఇందులో బాగుంటాడని భావిస్తున్నాడట. విశ్వక్సేన్ లాంటి అప్ కమింగ్ హీరో అయితే ఈ సినిమాలో బాగుంటుందని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English