రాశి ఇక్కడ మకాం వేసేసింది

రాశి ఇక్కడ మకాం వేసేసింది

రాశి ఖన్నాకి తెలుగు చిత్ర సీమలో ఒకేసారి పాపులారిటీ వచ్చి పడిపోలేదు. మొదటి సినిమాతోనే యువత దృష్టిలో పడింది కానీ ఇంకా తనకి పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు. ఇప్పటికీ టయర్‌ 2 హీరోలతోనే సినిమాలు చేస్తోన్న రాశి ఖన్నా ఇక తెలుగు చిత్ర సీమకే ఫిక్స్‌ అయిపోవాలని డిసైడ్‌ అయింది. ఇక హోటళ్లలో కాకుండా సొంతంగా ఒక ఇల్లు కొనేసుకుని మరీ ఇక్కడే సెటిలైంది.

అలాగే తెలుగు బాగా నేర్చేసుకున్న ఈ బ్యూటీ ఇక సొంత డబ్బింగ్‌ చెప్పుకుందామని ఫిక్సయింది. వెంకీ మామ తర్వాత వచ్చే చిత్రాల్లో రాశి సొంత గొంతునే వినిపిస్తుంది. ప్రతి రోజు పండగే, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ రెండిటికీ తనే డబ్బింగ్‌ చెబుతోంది. ఇక మీదట అన్ని సినిమాలకీ తానే చెప్పాలనుకుంటోంది. ఇకపోతే ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రాశి ఇప్పుడు చాలా స్లిమ్‌ అయిపోయింది. ఇంకా ఇంకా స్లిమ్‌ అవడానికి అహర్నిశలు కృషి చేస్తోంది.

హీరోయిన్ల కొరత బాగా వుంది కనుక ఏదో ఒక టైమ్‌లో తనకి పెద్ద సినిమాల్లో అవకాశాలు వరుసగా వచ్చి పడతాయని ఆమె నమ్ముతోంది. అందుకే ఒక మాదిరి చిత్రాలకి మొహమాటం లేకుండా నో చెప్పేస్తోంది. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి కనుక వచ్చే ఏడాది తన రాశి ఫలాలు బాగుంటాయని రాశి ఆశిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English