పవన్‌ 'అత్తారింట్లో' మహేష్‌?

పవన్‌ 'అత్తారింట్లో' మహేష్‌?

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న సినిమాకి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారనే సంగతి తెలిసిందే. అచ్చమైన ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకులకి పలు సర్‌ప్రైజులు ఇవ్వాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం అతను ప్రిన్స్‌ మహేష్‌బాబుతో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయించబోతున్నాడని, ఇటీవలే మహేష్‌తో ఈ మాట ప్రస్తావించాడని టాక్‌. జల్సా, బాద్షా చిత్రాలకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన మహేష్‌బాబు ఇంతవరకు ఏ సినిమాలోను గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ఇవ్వలేదు.

 మహేష్‌కి త్రివిక్రమ్‌ చాలా మంచి ఫ్రెండ్‌ కాబట్టి ఈ సినిమాలో ప్రిన్స్‌ కనిపిస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సినిమా యూనిట్‌ సభ్యులైతే తమకేం తెలీదన్నట్టు చూస్తున్నారు. కానీ మీడియాలో మాత్రం ఈ పుకారు చాలా స్పీడుగా స్ప్రెడ్‌ అవుతోంది. ఇంతవరకు త్రివిక్రమ్‌కి ఐడియా లేకపోయినా ఇప్పుడీ రూమర్‌లో ఇన్‌స్పయిర్‌ అయ్యి నిజంగానే మహేష్‌ని అప్రోచ్‌ అయితే, ప్రిన్స్‌ కాదనలేక ఓకే అంటే ఇక ఈ చిత్రంలో పవన్‌, మహేష్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడ్డానికి రెండు కళ్లు సరిపోతాయా చెప్పండి. ఆ అరుదైన ఘట్టం ఆవిష్కృతం అవ్వాలనే కోరుకుందాం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు