‘జార్జి రెడ్డి’ ధాటికి నిలవగలవా?

‘జార్జి రెడ్డి’ ధాటికి నిలవగలవా?

కొన్నిసార్లు కొన్ని చిన్న సినిమాలకు అనూహ్యమైన క్రేజ్ వస్తుంటుంది. ఊరూ పేరు లేని హీరోలు నటించినప్పటికీ.. సినిమాలో కంటెంట్ వల్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం, ఉద్వేగం కలుగుతాయి. గూస్ బంప్స్ కూడా వస్తాయి. ‘జార్జి రెడ్డి’ ట్రైలర్ చూసినపుడు చాలామంది ప్రేక్షకులకు ఇలాంటి ఫీలింగే కలిగింది.

ఇంతకుముందు ‘వంగవీటి’ అనే ఫ్లాప్  మూవీలో నటించిన సందీప్.. ‘దళం’ లాంటి జనాలకు పెద్దగా తెలియని సినిమా తీసిన జీవన్ రెడ్డిల కలయికలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్శిటీలో సంచలనాలకు కేంద్రంగా మారిన జార్జి రెడ్డి కథతో సినిమా తెరకెక్కడం.. ఆయన కథలోనే ఎంతో ఇంటెన్సిటీ, హీరోయిజం ఉండటం.. టేకింగ్ కూడా బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

విడుదలకు ముందు రోజు హైదరాబాద్‌లో పెయిడ్ ప్రిమియర్లు వేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు హౌస్ ఫుల్స్ అయ్యాయి. తొలి రోజు కూడా బుకింగ్స్ గట్టిగానే ఉన్నాయి. మొత్తానికి ‘జార్జి రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే ప్రభావం చూపించేలా ఉన్నాడు. మరి ఈ వారం రిలీజవుతున్న మిగతా సినిమాలు దీని ధాటికి నిలవగలవా అన్నది చూడాలి. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషించిన ‘రాగల 24 గంటల్లో’ ఈ వీకెండ్లో రాబోయే మరో చెప్పుకోదగ్గ చిత్రం. ‘ఢమరుకం’ దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ మీద పెద్దగా అంచనాలు లేవు.

అలాగే రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ‘తోలుబొమ్మలాట’కు కూడా బజ్ అంతంతమాత్రమే. వీటికి థియేటర్ల కేటాయింపు తక్కువే. అందులోనూ బుకింగ్స్ చాలా పూర్‌గా ఉన్నాయి. ‘జార్జి రెడ్డి’కి మంచి టాక్ కనుక వస్తే ఈ సినిమాలు తట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English