బాలయ్య రుణం అస్సలుంచుకోవట్లేదు

బాలయ్య రుణం అస్సలుంచుకోవట్లేదు

తెలుగులో అప్పుడెప్పుడో ‘రెయిన్ బో’ అని ఒక సినిమా చేసింది బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్. ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. దీంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. చిన్న, మీడియం సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు. బాలీవుడ్లోనూ ఆమె కెరీర్ పెద్దగా పుంజుకున్నది లేదు.

టాలీవుడ్ కెరీర్ మీద అసలేమాతరం ఆశల్లేని సమయంలో నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు బోయపాటి శ్రీను. సూపర్ హిట్ మూవీ ‘లెజెండ్’లో ఓ కథానాయికగా నటించింది సోనాల్. ఆ సినిమా బాగా ఆడటం, సోనాల్ గ్లామర్ ‌ఆకట్టుకోవడంతో తర్వాత తెలుగులో ఓ మోస్తరుగా అవకాశాలొచ్చాయి. బాలయ్యతో మళ్లీ ‘డిక్టేటర్’ సినిమాలో జోడీ కట్టే అవకాశమొచ్చింది.

‘లెజెండ్’తో తన కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన బాలయ్య రుణాన్ని అసలేమాత్రం ఉంచుకోకుండా ‘డిక్టేటర్’లో ఓ రేంజిలో అందాలు ఆరబోసింది. ఒక పాటలో సోనాల్ క్లీవేజ్ అందాలల ప్రదర్శకు కుర్రాళ్ల మతులు పోయాయి. ఐతే ఆ సినిమా తర్వాత మళ్లీ సోనాల్ కెరీర్లో బ్రేక్ వచ్చింది. కొంత విరామం తర్వాత ఆమెకు మళ్లీ బాలయ్యే అవకాశమిచ్చాడు. ఆయన కొత్త సినిమా ‘రూలర్’లో ఓ కథానాయికగా ఎంపికైంది సోనాల్.

ఈ సినిమాలోనూ సోనాల్ గ్లామర్ రోలే చేస్తున్నట్లుంది. ఇప్పటికే పోస్టర్లతోో మత్తెక్కించిన సోనాల్.. టీజర్లో బికినీ అందాలతో కుర్రకారును కవ్వించింది. చాలా రొటీన్‌గా, సగటు బాలయ్య మాస్ సినిమాలా కనిపించిన టీజర్లో సోనాల్ స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో తడి అందాలతో బాగానే హైలైట్ అయింది. బాలయ్య రుణాన్ని తీర్చే క్రమంలో ఆమె మరోసారి తన ఎక్స్‌పోజింగ్‌తో సినిమాకు ఆకర్షణ అయ్యేలాగే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English