బాలీవుడ్ మెగా మూవీ.. కథ చెప్పేది మన నాగార్జునే

బాలీవుడ్ మెగా మూవీ.. కథ చెప్పేది మన నాగార్జునే

బాలీవుడ్ ప్రేక్షులు బాగా పరిచయం ఉన్న తెలుగు హీరోల్లో అక్కినేని నాగార్జున ఒడు. ‘శివ’ సినిమా హిందీ వెర్షనే కాక ‘ఖుదాగవా’ సహా పలు హిందీ చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల మనసులు గెలిచాడు నాగ్. ఐతే ఒక దశలో ఇటు తెలుగులో, అటు హిందీలో సమాంతరంగా సినిమాలు చేసిన నాగ్.. ఆ తర్వాత ఉన్నట్లుండి బాలీవుడ్‌కు దూరం అయిపోయాడు.

పూర్తిగా తెలుగు సినిమాలపైనే దృష్టి పెడుతూ వచ్చిన నాగ్.. చాలా ఏళ్ల పాటు అటు వైపే చూడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ హిందీలో నటిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాత.. అయాన్ ముఖర్జీ లాంటి పేరున్న దర్శకుడు.. రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి స్టార్ తారాగణంతో పెద్ద ప్యాండిగే ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

తన పాత్రకు ప్రాధాన్యం ఉండటమే కాక.. అది కొత్తగా అనిపించడంతో తాను ‘బ్రహ్మాస్త్ర’ చేస్తున్నట్లు  నాగ్ గతంలోనే వెల్లడించాడు. ఈ సినిమాలోో నాగ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ సైతం పూర్తయింది. తాజాగా ఈ పాత్ర గురించి విశేషాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రంలో నాగ్ ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నాడు. చరిత్ర, సైన్స్ కలిసిన విభిన్నమైన కథతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

సినిమాలో ఆర్కియాలజిస్టు అయిన నాగ్ ఓ అద్భుతాన్ని కనుగొంటాడట. అక్కడి నుంచి ఆయన ఆ అద్భుతానికి సంబంధించిన కథను వివరిస్తాడట. సినిమా ఆరంభంలో, చివర్లో కీలక ఘట్టాల్లో నాగ్ పాత్ర ప్రధానంగా ఉంటుందని.. మధ్య మధ్యలో కథను నరేట్ చేస్తూ ఆయన పాత్ర సాగుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. మూడు భాగాలుగా తెరకెక్కున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 10న ఫస్ట్ పార్ట్‌తో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English