రాజశేఖర్.. ఒక ఇంట్రెస్టింగ్ సినిమా

రాజశేఖర్.. ఒక ఇంట్రెస్టింగ్ సినిమా

‘గరుడవేగ’తో మళ్లీ తన ఉనికిని చాటుకున్న సీనియర్ హీరో రాజశేఖర్.. ఆ తర్వాత ‘కల్కి’ లాంటి క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు  కానీ.. ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. దీని తర్వాత కన్నడ సినిమా ‘కవుల్దారి’ రీమేక్‌లో నటించాల్సింది కానీ.. అనివార్య కారణాలతో దాన్నుంచి తప్పుకున్నాడు.

దీని బదులు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే అది ఇంకా ఖరారవలేదు. ఈలోపు ఈ సీనియర్ హీరో వేరే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నిర్మాత.. ప్రసాద్ ల్యాబ్స్, ప్రసాద్ ఐమ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మాణంలో రాజశేఖర్ ఓ సినిమ ా చేయబోతున్నాడట. ఆ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తాడట.

రాజ్ ఇంతకుముందు రమేష్ ప్రసాద్ నిర్మాణంలోనే ‘ఆంధ్రా పోరి’, ‘రుషి’ అనే సినిమాలు చేశాడు. అవి రెండూ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆపై ‘ఐతే 2.0’ అనే మరో సినిమా కూడా తీశాడు రాజ్. అది కూడా ఆడలేదు. సినిమాలు ఫెయిలైనా రాజ్‌కు మంచి అభిరుచి ఉన్న రచయిత, దర్శకుడిగా పేరుంది. ఆయన రాసిన ‘సిరా’ అనే పుస్తకం ఆధారంగా రాజశేఖర్‌తో సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదొక థ్రిల్లర్ కథాంశంతో సాగే సినిమా అట. ఇందులో రాజశేఖర్ లాయర్‌గా, ప్రొఫెసర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. తెలంగాణలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా సాగుతుందని కూడా అంటున్నారు. మొత్తానికి రాజశేఖర్ తన తర్వాతి సినిమా కోసం మంచి సెటప్పే ఎంచుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English