అనసూయ పప్పులుడకలేదు!

అనసూయ పప్పులుడకలేదు!

'రంగమ్మత్త'గా రంగస్థలంలో కీలక పాత్ర చేసిన జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయకి ఇక చిత్ర సీమలో సుడి తిరుగుతుందని అనుకున్నారు. అయితే టీవీ రంగంలో ఒక లెవల్‌లో వుండి, సినిమా రంగంలో అంతకంటే తక్కువ రేంజ్‌కి అడ్జస్ట్‌ అవలేని చాలా మందిలానే అనసూయ కూడా తెలుగు సినిమా రంగంలో ఇమడలేకపోతోంది. ఆమెకి అవకాశాలయితే వస్తున్నాయి కానీ ఎందులోను ప్రాధాన్యం వున్న పాత్రలు రావడం లేదు.

హీరోయిన్‌గా నటించే వయసు కాకపోవడంతో ఆమె ఎందులో అయినా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే నటించాలి. అక్క, అత్తలాంటి పాత్రలకి దూరంగా వుండడం వల్ల అనసూయకంటూ ప్రత్యేకించి పాత్రలు రాయాల్సి వస్తోంది. ప్రత్యేకించి ఆమె తమ సినిమాలో వుండి తీరాలి అనుకునేవారు మినహా మరెవరూ అనసూయని ఎంకరేజ్‌ చేయడం లేదు. ఒకానొక టైమ్‌లో షూటింగ్స్‌ హడావిడి వల్ల జబర్దస్త్‌కి కూడా అనసూయ బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు జబర్దస్త్‌లోనే చీలికలు రావడంతో ఎవరి స్థానం వారు నిలుపుకోవడానికి తంటాలు పడుతోన్న పరిస్థితి. అందుకే ఇప్పుడిక టీవీ షోల మీదే అనసూయ దృష్టి పెడుతోంది. సినిమా షూటింగ్స్‌ అంటూ అవుట్‌డోర్లకి వెళ్లడం చేస్తే అసలుకే ఎసరు పడేలా వుందని ఆమె గ్రహించేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English