ఆర్ఆర్ఆర్ ప‌ది భాష‌ల్లో అన్నారు కానీ..

ఆర్ఆర్ఆర్ ప‌ది భాష‌ల్లో అన్నారు కానీ..

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు.. ఇందులో విల‌న్ పాత్ర‌ధారులు ఎవ‌ర‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చేసింది చిత్ర బృందం. ఆ ముగ్గురూ కూడా విదేశీయులే. సినిమాలో బ్రిటిష‌ర్ల పాత్ర‌ల్లో వీరు క‌నిపించ‌నున్నారు. ఈ అప్ డేట్ ఇస్తూ మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ టీం. అందులో ఒక విశేషం ఉంది. ఈ చిత్రాన్ని ప‌ది భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రిలీజ్ ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టం. వ‌ర‌ల్డ్ ఆడియ‌న్స్ కోసం ఇంగ్లిష్‌లో కూడా రిలీజ్ ఉండొచ్చు.  మిగ‌తా నాలుగు భాష‌లు ఏవి అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఐతే ఎన్ని భాష‌ల్లో రిలీజైన‌ప్ప‌టికీ.. మూలం అయితే తెలుగే. ఒక తెలుగు సినిమా ఇన్ని భాష‌ల్లోకి వెళ్ల‌బోతుండ‌టం గొప్ప‌ విష‌య‌మే.

ఐతే ప‌ది భాష‌ల్లో రిలీజ్ అన్నారు త‌ప్పితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. ఇంత‌కుముందు 2020 జులై 30న రిలీజ్ అని ఘ‌నంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఐతే లేటెస్ట్ ప్రెస్ నోట్‌లో మాత్రం డేట్ ప్ర‌క‌టించ‌లేదు. కేవ‌లం 2020 రిలీజ్ అని మాత్ర‌మే చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన ప్రెస్ మీట్లో ప‌క్కాగా జులై 30న రిలీజ‌వుతుందా అని అంటే.. డేట్ సంగ‌తేమో కానీ సంవ‌త్స‌రం మాత్రం మార‌ద‌ని అన్నాడు రాజ‌మౌళి. ఇప్పుడు ప‌రిణామాలు చూస్తుంటే ఈ మాట‌కే క‌ట్టుబ‌డ్డ‌ట్లుంది.

70 శాతం చిత్రీక‌ర‌ణ అయిందంటున్నారు కానీ.. అంత లేద‌న్న‌ది చిత్ర అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం. 70 శాతం నిజ‌మే అనుకున్నా.. మిగ‌తా 30 శాతం ముగించి.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేసి.. ప‌ది భాష‌ల్లో జులై 30న రిలీజ్‌కు రెడీ చేయాలంటే మాత్రం క‌ష్ట‌మే. కాబ‌ట్టి డేట్ మార్పు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English