అంద‌రూ బాగుందంటున్నారు.. క‌లెక్ష‌న్లెందుకు లేవో?

అంద‌రూ బాగుందంటున్నారు.. క‌లెక్ష‌న్లెందుకు లేవో?

వ‌రుస ఫ్లాపుల‌తో అల్లాడుతున్న యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్‌.. తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ సినిమా మీద చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వ‌చ్చింది. రివ్యూల‌న్నీ నెగెటివ్‌గానే వ‌చ్చాయి. ఐతే తమ సినిమా సూప‌ర్ హిట్ అని చెప్పుకుంటూ.. రివ్యూయ‌ర్ల మీద విరుచుకుప‌డిపోయాడు ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి. క‌ట్ చేస్తే సినిమాకు వీకెండ్లోనే స‌రైన వ‌సూళ్లు లేక‌పోయాయి.

ఐదు రోజులు ఆగాక ఇప్పుడు మ‌రోసారి స‌క్సెస్ మీట్ పెట్టారు. ఇందులో హీరో సందీప్ కొంచెం ఆవేద‌న‌తోనే మాట్లాడాడు. సినిమా రిజ‌ల్ట్ గురించి ఓపెన్‌గానే త‌న అభిప్రాయాలు చెప్పాడు. క్రిటిక్స్ పేరెత్త‌కుండానే ఈ సినిమా గురించి ఎక్కువ నెగెటివ్‌గా రాసి డ్యామేజ్ చేశార‌న్న అభిప్రాయం సందీప్ మాట‌ల్లో వ్య‌క్త‌మైంది. కొన్ని రోజులు గ‌డిచాక సినిమా రిజ‌ల్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడ‌దామ‌ని ఆగాన‌ని సందీప్ చెప్పాడు. తాను ఏఎంబీ సినిమాస్‌తో పాటు మ‌రో మ‌ల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్‌కు వెళ్లి సినిమా చూశాన‌ని.. 70 శాతం సినిమాలో ప్రేక్ష‌కులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నార‌ని.. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ బాగుంద‌ని అంటున్నార‌ని సందీప్ చెప్పాడు.

చాలా మంది కాల్ చేసి బాగోద‌నే ఉద్దేశంతో సినిమాకు వెళ్లి.. బాగుందే అని అంటున్నార‌ని.. వాళ్ల‌కు ముందే ఆ ఫీలింగ్ ఎందుకు క‌లిగిందో అర్థం కాలేద‌ని సందీప్ చెప్పాడు. ఐతే త‌మ సినిమా అంద‌రూ బాగుందంటున్నా క‌లెక్ష‌న్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవ‌ని సందీప్ చెప్పాడు. వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత వ‌చ్చిన త‌న గ‌త సినిమా నిను వీడ‌ని నీడ‌ను నేనేకు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు కూడా ఈ సినిమాకు రాలేద‌న్నాడు. మంచి సెట‌ప్ ఉండి.. కామెడీ జాన‌ర్లో న‌వ్వించే సినిమా తీసినా అనుకున్న‌ట్లుగా వ‌సూళ్లు రాక‌పోవ‌డం నిరాశ క‌లిగిస్తోంద‌న్న సందీప్.. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూస్తే క‌చ్చితంగా బాగా న‌వ్వుకుంటార‌ని ప్రేక్ష‌కుల్ని ఉద్దేశించి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English