ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఒప్పేసుకుందే..

ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఒప్పేసుకుందే..

కొందరు హీరోయిన్లను చూడగానే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది.  క‌న్న‌డ‌ భామ కృతి కర్బందా ఈ కోవకే చెందుతుంది. పవన్ కళ్యాణ్ సరసన చేసిన ‘తీన్ మార్’ కావచ్చు.. రామ్‌తో చేసిన ‘ఒంగోలు గిత్త’ కావచ్చు.. ఇంకా తెలుగులో చేసిన మిగతా చిత్రాలు కావచ్చు.. అన్నింట్లోనూ ఆమె ట్రెడిషనల్ లుక్‌లోనే దర్శనమిచ్చింది.  ద‌క్షిణాదిన ఇత‌ర భాష‌ల్లో చేసిన సినిమాల్లోనూ ఆమె అలాగే క‌నిపించింది. అలాంటి హీరోయిన్ బాలీవుడ్లో రాజ్-3 లాంటి ఎరోటిక్ మూవీతో ఎంట్రీ ఇవ్వ‌డం షాకింగే. ఆ త‌ర్వాత కూడా బాలీవుడ్డో హాట్ హాట్ పాత్ర‌లే చేసింది కృతి.

రోమ్‌కు వెళ్తే రోమ‌న్‌లా ఉండాల‌న్న‌ట్లు... బాలీవుడ్‌కు వెళ్ల‌గానే అక్క‌డి అల‌వాట్ల‌న్నీ వంట‌బ‌ట్టించుకుంది. సినిమాల్లో బోల్డ్‌గా క‌నిపించ‌డ‌మే కాదు.. ఎఫైర్ కూడా మొద‌లుపెట్టిన‌ట్లు వార్త‌లొచ్చాయి.. బాలీవుడ్‌ నటుడు పుల్‌కిత్‌ సామ్రాట్‌తో ఆమె ప్రేమలో ఉందంటూ గత కొన్నిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే పుల్‌కిత్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని గ‌తంలో చెప్పిన కృతి.. తాజాగా  అత‌డితో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవ‌డం విశేషం.

‘‘మొద‌ట‌ నేను పుల్‌కిత్‌తో మామూలుగానే ఉన్నాను. త‌ర్వాత‌ సన్నిహితంగా మెలిగాను. అతను నా అభిప్రాయాలను గౌరవించాడు. మనసుకు దగ్గరైన వ్యక్తిని, ఇష్టాలు తెలుసుకుని నడుచుకునే అబ్బాయిని ఏ అమ్మాయైనా వదులుకుంటుందా? అందుకే నేను అతని ప్రేమలో పడిపోయా. మా ఇంట్లోవాళ్లు పుల్‌కిత్‌ను అంగీకరిస్తారో లేదో అని భయపడ్డాను. ఒక్కోసారి మనసులోని ప్రేమను తెలియజేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు. కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ నా విషయంలో అది నెలల కాలంలోనే నెరవేరింది. నేను చాలా అదృష్టవంతురాలిని..’’ అని కృతి చెప్పింది. గ‌త ఏడాది విడుదలైన ‘వీరే కీ వెడ్డింగ్‌’ చిత్రంలో కృతి-పుల్‌కిత్‌ కలిసి న‌టించారు. ఇప్పుడు ‘పాగల్ పంటి’తో మ‌రోసారి జోడీ క‌ట్టారు. ఈ చిత్రం శుక్ర‌వార‌మే విడుద‌ల‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English