ఎన్టీఆర్‌ వాడేసిన క్యారెక్టర్‌తో పూరీ జగన్నాథ్‌?

ఎన్టీఆర్‌ వాడేసిన క్యారెక్టర్‌తో పూరీ జగన్నాథ్‌?

పూరి జగన్నాథ్‌ అప్పట్లో ఎన్టీఆర్‌ కోసం ఒక కథ చెప్పాడు. అందులో హీరో నత్తివాడు. ఎన్టీఆర్‌కి ఆ కథ నచ్చలేదు కానీ ఆ నత్తి అనే పాయింట్‌ నచ్చింది. అందుకే 'జై లవకుశ'లో చేసిన మూడు పాత్రల్లో ఒకటి నత్తిగా మాట్లాడుతుంది. అప్పట్లో ఆ క్యారెక్టర్‌ చూసి పూరి హర్టయ్యాడు కూడా. తన ఐడియాని ఎన్టీఆర్‌ వేరే సినిమాలో ఇంప్లిమెంట్‌ చేసేసాడని పూరి బాధ పడ్డాడని మీడియాలోను వార్తలొచ్చాయి.

అదే కథని పూరి పలువురు హీరోలకి వినిపించాడు కానీ ఎవరూ ఓకే చెప్పలేదు. విచిత్రంగా అదే కథని విజయ్‌ దేవరకొండ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసాడు. అతనికి చెప్పినపుడు పూరి దగ్గర ఇరవై నిమిషాల నిడివి మాత్రమే స్టోరీ వుంది. అది వినే 'ఫైటర్‌' చేయడానికి దేవరకొండ ఊ కొట్టేసాడు. ఇక దానిని పూరి తన మార్కు మసాలా ఎలిమెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ స్టయిల్‌కి తగ్గట్టు మారుస్తున్నాడు.

ఆ నత్తి లక్షణం అయితే ఇంకా అలాగే వుంచాడని, విజయ్‌ దేవరకొండ నత్తిగా మాట్లాడితే మరింత కొత్తగా ఫీలవుతారని దానిని మార్చలేదని తెలిసింది. ఎన్టీఆర్‌ వాడేసుకున్నాడని పూరి గుస్సా అయిన ఆ పాత్ర ఇప్పుడు విజయ్‌ దేవరకొండకి ఎలా వుంటుందనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడో హిట్‌ తప్పకుండా కావాలనే ఒత్తిడి ఎదుర్కొంటోన్న విజయ్‌ దేవరకొండ మిగతా సినిమాలని పక్కన పెట్టి మరీ ఫైటర్‌ని ట్రాక్‌ ఎక్కిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English