హీరో సొంత డబ్బులకే ఎసరు?

హీరో సొంత డబ్బులకే ఎసరు?

'ఆర్‌ఎక్స్‌ 100'తో సక్సెస్‌ అయిన కార్తికేయకి ఆ చిత్రం వల్ల ఎలాంటి ఫాన్‌ ఫాలోయింగ్‌ రాలేదు. అయితే ఆ చిత్రం సక్సెస్‌ అంతా తన క్రెడిట్టే అనుకుని, సోషల్‌ మీడియాలో తాను వేసిన ప్రతి పోస్ట్‌కి 'అన్నా నువ్వు సూపర్‌' అంటూ రెస్పాండ్‌ అయ్యే పని లేని బ్యాచ్‌ని అంతా నిజంగా ఫాన్సే అనుకుని 'హిప్పీ', 'గుణ 369' చిత్రాలు చేసాడు. అవి రెండూ ప్రేక్షకులని మెప్పించలేక, జనాన్ని థియేటర్లకి రప్పించలేక చతికిలపడ్డాయి.

దీంతో యువత మెచ్చే అంశాలేవో అందులో తక్కువయ్యాయి కనుక ఫ్లాప్‌ అయ్యాయని, వారిని తాగుడు కాన్సెప్ట్‌తో ఆకట్టుకోవాలని '90 ఎంఎల్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలోనే తెరకెక్కించారు. దీనికి ఎలాగయినా క్రేజ్‌ తీసుకురావాలని కార్తికేయ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100కి వచ్చిన వైరల్‌ హైప్‌ రావడం అంత ఈజీ కాదు. ఆ చిత్రానికి 'పిల్లా రా' అనే బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ కూడా పెద్ద ప్లస్‌ అయింది.

అలాగే ఆ చిత్రానికి హీరోయిన్‌ గ్లామర్‌ కూడా ఆకర్షణగా నిలిచింది. సోలోగా తానే అన్నీ అయి తాగుబోతు కహానీతో క్రేజ్‌ తీసుకురావాలని కార్తికేయ చూస్తున్నాడు కానీ నిజంగా సినిమాలో చాలా గొప్ప లక్షణాలుంటే తప్ప మళ్లీ అతడికి ఆ సినిమాకి వచ్చిన స్పందన రావడం కాస్త కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English