ఆ ఫ్లాప్‌ సినిమానే మళ్లీ తీసాడా?

ఆ ఫ్లాప్‌ సినిమానే మళ్లీ తీసాడా?

గౌతమ్‌ మీనన్‌ తాజా చిత్రం 'తూటా' ట్రెయిలర్‌ చూస్తే అతనే తీసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం గుర్తుకొచ్చి తీరుతుంది. నాగచైతన్యతో గౌతమ్‌ తీసిన ఆ చిత్రం చాలా కాలం పాటు వాయిదాలు పడి చివరకు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ అయింది. ఈసారి ధనుష్‌తో గౌతమ్‌ తీసిన ఈ చిత్రంలో ఆ సినిమా ఛాయలు బాగా కనిపిస్తున్నాయి. అది కూడా యాక్షన్‌, రొమాన్స్‌ మిక్స్‌ చేసి చేసిన కిచిడీ.

గౌతమ్‌ మీనన్‌ ఇదివరకు పకడ్బందీ కథలతో మంచి సినిమాలు తీసేవాడు కానీ ఇటీవల అన్నీ హాఫ్‌ బేక్డ్‌ ఐడియాలతోనే చుట్టేస్తున్నాడు. అతనిపై వున్న అభిమానంతో ఇంకా ఫ్రంట్‌లైన్‌ హీరోలు డేట్స్‌ ఇస్తున్నారు. అతనితో ఒక సినిమా అయినా చేయాలనే కోరిక వున్న హీరోలు చాలా మందే వున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఆ క్రేజ్‌నే వాడుకుంటూ అరకొర సినిమాలు తీసి అభిమానులని బాధ పెడుతున్నాడు.

ఒకే సినిమాని తిప్పి, తిప్పి తీసే అలవాటున్న గౌతమ్‌ మీనన్‌ ఈసారి 'సాహసం శ్వాసగా సాగిపో'నే మళ్లీ తీసాడనేది అర్థమవుతోంది. అయితే ఈసారి అయినా దానిని బాగా తీసాడా లేక అందులో మాదిరిగానే సగం, సగం ఐడియాలతో కానిచ్చేసాడా అనేది నవంబర్‌ 29న తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ తూటాకి పోటీగా చాలా చిత్రాలు రిలీజవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English