హీరోయిన్ల వెంట పడుతోన్న వరుణ్‌ తేజ్‌

హీరోయిన్ల వెంట పడుతోన్న వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ కెరియర్‌ గ్రాఫ్‌ చిత్రంగా వుంటుంది. అతని ఖాతాలో ఫిదా, ఎఫ్‌ 2 లాంటి భారీ హిట్లున్నాయి. ఒక మాదిరిగా ఆడిన తొలిప్రేమ, వాల్మీకి కూడా హిట్లుగానే చలామణీ అవుతున్నాయి. అయితే యాభై కోట్ల పైబడి లేదా పాతిక కోట్లకి పరిమితమయి వరుణ్‌ తేజ్‌ మార్కెట్‌ ఇంతవరకు స్టేబుల్‌ అవలేదు. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో వరుణ్‌ తేజ్‌ ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటున్నాడు.

వాల్మీకి చిత్రానికి అంత క్రేజ్‌ రావడానికి, అది బ్రేక్‌ ఈవెన్‌ అవడానికి కారణమయిన పూజా హెగ్డే ఫ్యాక్టర్‌ని అతను కనిపెట్టాడు. ఫిదాకి కూడా హీరోయిన్‌ క్రేజ్‌ ఎంత ప్లస్‌ అయిందో అతనికి తెలుసు. అందుకే ఇక మీదట చేసే చిత్రాల్లో క్రేజీ హీరోయిన్లని పెట్టమని డిమాండ్‌ చేస్తున్నాడు. ఎవరికోసమయితే యువత, మాస్‌ థియేటర్లకి వస్తారో అలాంటి హీరోయిన్లని తీసుకు రమ్మని, పారితోషికం ఎక్కువయినా, ప్రాజెక్ట్‌ కాస్త ఆలస్యమయినా ఫరవాలేదు కానీ తన సినిమాలో ఇక పాపులర్‌ హీరోయిన్లే వుండాలని వరుణ్‌ తేజ్‌ ఖచ్చితంగా చెబుతున్నాడట.

తన మార్కెట్‌ పాతిక కోట్ల లోపు స్టక్‌ అవడంతో దానిని ఎలాగయినా నలభై కోట్లకి చేర్చాలని వరుణ్‌ తనకి తెలిసిన కిటుకులు వాడుతున్నాడన్నమాట. అయితే హీరోగా తన రేంజ్‌ పెంచే పాత్రలు చేస్తుంటే మార్కెట్‌ ఆటోమేటిగ్గా పెరుగుతుందని అతను మరచిపోతున్నాడు. ఇంతవరకు తన కెరియర్‌లో ముద్ర పడిపోయే పాత్రనయితే చేయలేదు. అలాంటి పాత్రలు చేస్తే విజయ్‌ దేవరకొండ మాదిరిగా ఆటోమేటిగ్గా క్రౌడ్‌ పుల్లర్‌ అయిపోతాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English