నీరుగార్చేసిన రాజమౌళి

నీరుగార్చేసిన రాజమౌళి

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రానికి ప్రత్యేక పబ్లిసిటీ అక్కర్లేదని దీని గురించి అధికారికంగా మాట్లాడినపుడు అదే ప్రచారం అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకే ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ఒక్క స్టిల్‌ కూడా వదల్లేదు. కీనంస ఇంతవరకు ఈ చిత్రానికి పేరు కూడా ప్రకటించలేదు. ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయినపుడు ఏ హాష్‌ట్యాగ్‌ వాడారో అదే టైటిల్‌తో ఇది చలామణీ అవుతోంది.

ఇక ఈ చిత్రం డెబ్బయ్‌ శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందని సగర్వంగా చెబితే విడుదల తేదీని పునరుద్ఘాటిస్తారని, రిలీజ్‌ డేట్‌పై నెలకొన్న సందేహాలని తీరుస్తారని భావించారు. కానీ కేవలం ఈ చిత్రంలో నటిస్తోన్న విదేశీ తారల పేర్లు మాత్రం ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. విదేశీ తారలంటే వారి వల్ల ఈ చిత్రానికి ఎలాంటి ప్రత్యేక గుర్తింపు రానటువంటి వారిని తీసుకున్నారు.

రిలీజ్‌ డేట్‌ పట్ల అధికారిక ప్రకటన చేయకపోవడం, కనీసం ట్విట్టర్‌లో హాష్‌టాగ్స్‌లో అయినా అది మెన్షన్‌ చేయకపోవడంతో ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ పట్ల రాజమౌళికి కూడా ఇంకా క్లారిటీ లేదనేది తేలిపోయింది. షూటింగ్‌ పూర్తి కావడానికే ఏప్రిల్‌ వరకు అవుతుందని, ఒకసారి రఫ్‌ కట్‌ చూసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌ అవసరమయితే కొనసాగిస్తారని, అంచేత ఇప్పుడే రిలీజ్‌ డేట్‌ చెప్పేసి తమపై తామే ఒత్తిడి పెంచుకోరాదని ఇలా నిర్ణయించుకున్నారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English