నిప్పు రవ్వ లుక్‌లో బాలయ్య

నిప్పు రవ్వ లుక్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఒకసారి షూటింగ్‌ మొదలు పెట్టాడంటే ఇక ఆగడు. శరవేగంగా సినిమా పూర్తి చేసేస్తాడు. తన కొత్త సినిమా ‘రూలర్’ను కూడా అదే స్పీడుతో అవగొట్టేశాడు. జులైలో చిత్రీకరణ మొదలుపెడితే.. నవంబరుకల్లా షూటింగ్ అయిపోయింది. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా రిలీజ్ లోపే బాలయ్య కొత్త సినిమాను మొదలు పెట్టేయబోతున్నట్లు సమాచారం.

ఇంతకుముందు బాలయ్యకు ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించే ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. స్క్రిప్టు కూడా పక్కాగా రెడీ అయింది. ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి.

డిసెంబరు 9న ముహూర్తం నిర్వహించి.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేయనున్నారు. ‘రూలర్’ సినిమా కోసమే బాగా బరువు తగ్గిన బాలయ్య.. బోయపాటి చిత్రం కోసం ఇంకా సన్నబడ్డాడు. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని లీన్ లుక్‌లో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. కాస్త గడ్డం కూడా పెంచి ‘నిప్పు రవ్వ’ లుక్‌లోకి బాలయ్య మారబోతున్నట్లు సమాచారం.

ఇటీవల బసవతారకమ్మ క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్య లుక్ చూస్తే అభిమానులకు ‘నిప్పురవ్వ’ సినిమానే గుర్తుకొచ్చింది. 90ల నాటి బాలయ్య ఎవర్ గ్రీన్ సినిమాల లుక్‌తో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశాడట బోయపాటి. సింహా, లెజెండ్ సినిమాల్లో మాదిరే ఇందులోనూ నందమూరి హీరో ద్విపాత్రాభినయమే చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్ర లుక్ ‘నిప్పురవ్వ’ను తలపించేలా.. ఇంకోటి మరో తరహా లుక్ ఉండేలా చూసుకుంటున్నాడట బోయపాటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English