దిల్‌ రాజులో ఇంత నీరసమేంటి?

దిల్‌ రాజులో ఇంత నీరసమేంటి?

మిగిలిన నిర్మాతలు సినిమాలు తీసినా, లేకపోయినా కానీ తాను మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలని లైన్లో వుంచే దిల్‌ రాజులో మునుపటి చురుకు ఎందుకో లేదిప్పుడు. మహర్షి చిత్రాన్ని మహేష్‌తో సోలోగా చేయాల్సినవాడల్లా హీరో ఆజ్ఞల మేరకు మరో ఇద్దరితో కలిసి నిర్మించాడు.

ఆ చిత్రాన్ని హిట్టనిపించడం కోసం దిల్‌ రాజు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. నిర్మాతలకి కనీస లాభాలు కూడా రాకపోవడంతో దిల్‌ రాజు అన్యమనస్కంగానే మహేష్‌ తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'కి నిర్మాతలలో ఒకడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇది పేరుకే దిల్‌ రాజు సినిమా అని, అతనికి ఇందులో నైజాం హక్కుల మినహా మరే విధమైన సంబంధం లేదని చెబుతున్నారు. ఇదిలావుంటే తాను నిర్మిస్తోన్న ఇతర చిత్రాల విషయంలో కూడా దిల్‌ రాజు ఎలాంటి దూకుడు చూపించడం లేదు.

96 చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాల్సినది ఫిబ్రవరికి వాయిదా వేసాడు. మరో చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'పై దిల్‌ రాజే అంతగా ఆసక్తి చూపించడం లేదు. అల్లు అర్జున్‌తో అనుకున్న 'ఐకాన్‌' వుండదనే అంటున్నారు. పవన్‌కళ్యాణ్‌తో చేద్దామనుకున్న 'పింక్‌' కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టేసారు. ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాడు కానీ ఇంతవరకు అటునుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English