‘సాహో’ తర్వాత చిన్న సినిమానే..

‘సాహో’ తర్వాత చిన్న సినిమానే..

'మగధీర' లాంటి భారీ చిత్రం తర్వాత రాజమౌళిపై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఆ సమయంలో తనపై తాను ఒత్తిడి తగ్గించుకోవడానికి.. జనాల్లో అంచనాలు తగ్గించడానికి తెలివిగా 'మర్యాదరామన్న' లాంటి చిన్న సినిమా చేశాడు జక్కన్న. ఇప్పుడు 'సాహో' సినిమా తర్వాత సుజీత్ సైతం ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు సమాచారం. 'మగధీర'లా 'సాహో' అద్భుతాలేమీ చేయలేదు కానీ.. ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా తర్వాత సుజీత్ ఎలాంటి సినిమా ఎంచుకుంటాడనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది. అతడితో ఓ చిన్న సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ వాళ్లే రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ‘సాహో’ వైఫల్యానికి కేవలం సుజీత్‌ను బాధ్యుడిని చేయడానికి లేదు ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమా అనేసరికి... బడ్జెట్, స్కేల్ మీద ఫోకస్ ఎక్కువ కావడంతో సినిమా దెబ్బ తినేసింది.

'సాహో' వల్ల దెబ్బ తిన్న సుజీత్ కెరీర్‌ను యువి వాళ్లే చక్కదిద్దబోతున్నరట. అతడితో వరుసగా మూడో సినిమాను నిర్మించనున్నారట. సుజీత్-యువి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా 'రన్ రాజా రన్'లో హీరోగా నటించిన శర్వానందే ఈ సినిమాలోనూ కథానాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. తనపై అంచనాలేమీ లేనపుడు.. పరిమిత బడ్జెట్లో చక్కటి సినిమా తీసి ప్రతిభ చాటుకున్నాడు సుజీత్. ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్ శిఖర స్థాయికి చేరుకున్న సమయంలో తర్వాతి సినిమా భారాన్ని సుజీత్ మీద పెట్టేయడంతో అతను తడబడ్డాడు. ఇప్పుడు శర్వాతో తన స్టయిల్లో కంటెంట్ ప్రధానంగా సినిమా తీసి తనేంటో రుజువు చేయాలని సుజీత్ చూస్తున్నాడు. 'రన్ రాజా రన్' లాగా మరీ చిన్న సినిమాగా కాకుండా మీడియం బడ్జెట్లోనే ఈ సినిమాను తీర్చిదిద్దే అవకాశముంది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English