అరవోళ్ల అహాన్ని దెబ్బ తీస్తున్న 'బాహుబలి'

అరవోళ్ల అహాన్ని దెబ్బ తీస్తున్న 'బాహుబలి'

ఆత్మాభిమానం ఎవరికైనా ఉంటుంది.  కానీ తమిళ జనాలకు అది కొంచెం ఎక్కువే. కొన్నిసార్లు అది దురభిమానంలాగా కూడా మారుతుంది. సినిమాల విషయానికి వస్తే ఇండియాలో తమను మించి గొప్ప సినిమాలు తీసేవాళ్లు లేరనే ఫీలింగ్‌లో వాళ్లుంటారు. నిజానికి అక్కడ ఒకానొక దశలో మిగతా ఇండస్ట్రీల్ని మించి గొప్ప గొప్ప సినిమాలు వచ్చిన మాట కూడా వాస్తవం.

కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. తెలుగులోంచి తమిళ సినిమాల్ని వెనక్కి నెట్టే సెన్సేషనల్ సినిమాలెన్నో వచ్చాయి. గొొప్ప ప్రయత్నాలు జరిగాయి. తమిళ ఫిలిం మేకర్ల ఊహకైనా అందని విధంగా 'బాహుబలి'ని తీర్చిదిద్ది వాళ్లకు అసూయ పుట్టేలా చేశాడు రాజమౌళి. మామూలుగా వేరే భాషల చిత్రాల్ని అస్సలు పట్టించుకోని తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేశారు. తమిళ సినీ చరిత్రలోనే ఏ సినిమాకూ సాధ్యం కాని వసూళ్లను ఈ సినిమా రాబట్టింది.

'బాహుబలి-2' తమిళనాట ఏకంగా రూ.158 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ రికార్డు నమోదై రెండున్నరేళ్లు అవుతోంది. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా దీన్ని అందుకోలేదు. రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లకు కూడా ఆ రికార్డు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఎన్నో అంచనాలతో వచ్చిన '2.0' కూడా 'బాహుబలి-2' రికార్డుకు చాలా దూరంలో ఆగిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అజిత్ మూవీ 'విశ్వాసం' ఓపెనింగ్స్ చూసి 'బాహుబలి-2' రికార్డు బద్దలే అన్నారు. కానీ ఆ చిత్రం రూ.131 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ సినిమా ‘విజిల్’ మీద ఆశలు పెట్టుకున్నారు. అది 'విశ్వాసం'ను దాటింది కానీ.. 'బాహుబలి-2' రికార్డును బద్దలు కొట్టే అవకాశమే కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ సినిమా వసూళ్లు రూ.133 కోట్ల దగ్గర ఉన్నాయి. థియేట్రికల్ రన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో 'విజిల్' రూ.140 కోట్ల మార్కును అందుకోవడం కూడా అసాధ్యంగానే ఉంది. మొత్తానికి పరిస్థితి చూస్తే ఇప్పుడిప్పుడే 'బాహుబలి-2' రికార్డులు బద్దలయ్యేలా కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English